![]() |
![]() |

ప్రస్తుతం ఇండియన్ సినిమాలో పలు భారీ సినిమాలు రూపొందుతున్నాయి. వాటిలో మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'SSMB29', అల్లు అర్జున్-అట్లీ కాంబోలో రూపుదిద్దుకుంటున్న 'AA22' ప్రధానమైనవి. ఈ సినిమాలకు రూ.2000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టగల సత్తా ఉందనే అంచనాలున్నాయి. అలాంటిది ఈ రెండు సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ బరిలోకి దిగే అవకాశాలున్నాయనే వార్త.. ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి.. తన తదుపరి సినిమాని మహేష్ బాబుతో చేస్తున్నారు. కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. హాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యేలా దీనిని మలుస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మరోవైపు 'AA22' ప్రాజెక్ట్ ని సైతం 2027 వేసవిని టార్గెట్ చేసుకునే తెరకెక్కిస్తున్నట్లు వినికిడి. 'పుష్ప-2' తర్వాత అల్లు అర్జున్, 'జవాన్' తర్వాత అట్లీ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ తో గ్లోబల్ మార్కెట్ ని షేక్ చేయాలని.. బన్నీ, అట్లీ భావిస్తున్నారు.
కంటెంట్ పరంగా, కాంబినేషన్ పరంగా, బడ్జెట్ పరంగా ఇలా ఏ అంశం తీసుకున్నా.. 'SSMB29', 'AA22' రెండూ భారీ సినిమాలే. అలాంటిది ఈ రెండూ ఒకేసారి విడుదలైతే మొదట ఏ సినిమా చూడాలో అర్థంకాని పరిస్థితి ప్రేక్షకుల్లో కూడా ఏర్పడుతుంది.
అయితే ఈ తరహా భారీ సినిమాలకు సోలో రిలీజ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మ్యాగ్జిమమ్ థియేటర్లలో సినిమాను విడుదల చేయాలి. అలాంటిది ఒకేసారి రెండు భారీ సినిమాలు వస్తే.. థియేటర్ల సమస్య వస్తుంది. కలెక్షన్లపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి, కనీసం నాలుగు వారాల గ్యాప్ ఉంటే మంచిది. 'SSMB29', 'AA22' రెండు మూవీ టీంలు మాట్లాడుకొని అందుకు తగ్గట్టుగా రిలీజ్ ప్లాన్ చేసుకుంటారేమో చూడాలి.
![]() |
![]() |