![]() |
![]() |

ఈ జనరేషన్ లో హీరోలకు సమానమైన క్రేజ్ సంపాదించుకున్న అతి కొద్దిమంది హీరోయిన్లలో అనుష్క శెట్టి (Anushka Shetty) ఒకరు. అలాంటి అనుష్క కొన్నేళ్లుగా సినిమాలు తగ్గించారు. 'బాహుబలి' తర్వాత ఆమె చాలా తక్కువ సినిమాల్లోనే నటించారు. గత ఎనిమిదేళ్లలో అనుష్క నుంచి 'భాగమతి', 'నిశ్శబ్దం', 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' అనే మూడు సినిమాలు మాత్రమే వచ్చాయి. వాటిలో 'నిశ్శబ్దం' నేరుగా ఓటీటీలోనే విడుదలైంది. దీంతో అనుష్క కొత్త సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. (Ghaati Movie Business)
సెప్టెంబర్ 5న 'ఘాటి'తో ప్రేక్షకులను పలకరించనున్నారు అనుష్క. క్రిష్ దర్శకుడు కావడంతో పాటు, 'భాగమతి' తర్వాత అనుష్క నుంచి వస్తున్న ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ కావడంతో.. 'ఘాటి'పై మంచి అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్లే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఏకంగా రూ.20 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. నైజాంలో రూ.7 కోట్లు, ఆంధ్రాలో రూ.10 కోట్లు, సీడెడ్ రూ.4 కోట్లు చొప్పున.. తెలుగు స్టేట్స్ లో రూ.21 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం. వరల్డ్ వైడ్ గా రూ.25 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసే అవకాశముంది అంటున్నారు. ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ కి ఈ బిజినెస్ అనేది గొప్ప విషయమే. దీనిని బట్టి చూస్తుంటే.. అనుష్క క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని అర్థమవుతోంది.
![]() |
![]() |