![]() |
![]() |

అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ (94) కన్నుమూసిన సంగతి తెలిసిందే. శనివారం నాడు సినీ, రాజకీయ ప్రముఖులు కనకరత్నమ్మ పార్థివ దేహానికి నివాళులు అర్పించి.. అల్లు కుటుంబాన్ని పరామర్శించారు. అయితే వైజాగ్ లో నిన్న జనసేన సమావేశం ఉండటంతో.. పవన్ కళ్యాణ్ రాలేకపోయారు. (Allu Kanakaratnam)
వైజాగ్ సమావేశం ముగించుకొని హైదరాబాద్ వచ్చిన పవన్ కళ్యాణ్.. ఆదివారం నాడు అల్లు నివాసానికి వెళ్లి అల్లు అరవింద్, అల్లు అర్జున్ లను పరామర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. (Pawan Kalyan)
మెగా, అల్లు కుటుంబాల మధ్య దూరం పెరిగిందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య గ్యాప్ ఉందంటూ.. కొందరు ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ ని పవన్ కళ్యాణ్ పరామర్శించడం, ఆ ఫొటో బయటకు రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఎప్పటికైనా మెగా, అల్లు కుటుంబాలు ఒకటేనని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

![]() |
![]() |