![]() |
![]() |

మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)నుంచి సినిమా వస్తుంటే, బాక్స్ ఆఫీస్ ఏ విధంగా కలకలలాడుతుందో, ఈ నెల 14 న 'వార్ 2'(War 2)తో మరోసారి నిరూపించాడు. టాక్ తో సంబంధం లేకుండా తెలుగులో బాగానే కలెక్షన్స్ ని రాబట్టింది. ఎన్టీఆర్ వల్లనే ఆ విధంగా సాధ్యమయ్యింది. ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీని స్టార్ డైరెక్టర్ 'ప్రశాంత్ నీల్'(Prashanth Neel)తో చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ నుంచి వస్తున్న ఈ 31 వ చిత్రంపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ చిత్రం గత ఏడాది ఆగస్ట్ లో పూజాకార్యక్రమాలతో ప్రారంభమవ్వగా,రెగ్యులర్ షూటింగ్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రారంభమైంది. మూవీలోని మిగతా నటీనటులపై సన్నివేశాలని చిత్రీకరించారు.ఏప్రిల్ 22 న ఎన్టీఆర్ షూటింగ్ లో జాయిన్ అవ్వగా, కర్ణాటకలోని మంగుళూరులో వేసిన ఒక భారీ సెట్ లో యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరించారు. ఆ తర్వాత చిత్రం గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు స్పందిస్తు మూవీ గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్ ఉండాలని, ఎంత పెద్ద సినిమా అయినా, ఈ రోజుల్లో పబ్లిసిటీ మొదట్నుంచి ఉండాలని, తద్వారా మూవీ ప్రేక్షకుల్లోకి మరింతగా దగ్గరకి వెళ్తుందని కామెంట్స్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి(Anil Ravipudi),చిరంజీవి(Chiranjeevi)సినిమా కూడా ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నారని చెప్తున్నారు.
ఇక అధికారకంగా ప్రకటించకపోయినా 'డ్రాగన్'(Dragon)అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మెజారిటీ అభిమానులు డ్రాగన్ టైటిల్ ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదల కానుంది. కన్నడ స్టార్ హీరోయిన్ 'రుక్మిణి వసంత్'(Rukmini Vasanth)ఎన్టీఆర్ తో జత కడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

![]() |
![]() |