![]() |
![]() |

`అణ్ణాత్తే`, `బీస్ట్`, `వాలిమై`.. ప్రస్తుతం తమిళ తంబీలంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమాలివి. `అణ్ణాత్తే`లో సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా నటిస్తుండగా.. `బీస్ట్`లో దళపతి విజయ్ హీరో. ఇక `తల` అజిత్ కథానాయకుడిగా `వాలిమై` తెరకెక్కుతోంది.
కాగా, వీటిలో `అణ్ణాత్తే` దీపావళి కానుకగా నవంబర్ 4న రాబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించింది. తాజాగా ఆ విషయాన్ని మరోసారి ధ్రువీకరించింది. ఇక విజయ్ `బీస్ట్` విషయానికి వస్తే.. ఈ సినిమాని కూడా సన్ పిక్చర్స్ సంస్థనే నిర్మిస్తోంది. ఇప్పటివరకు ఒక షెడ్యూల్ నే పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. తాజాగా రెండో షెడ్యూల్ కి శ్రీకారం చుట్టిందని బజ్. కాగా, ఈ చిత్రాన్ని 2022 పొంగల్ కి రిలీజ్ చేయబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో.. అజిత్ `వాలిమై` ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అన్న విషయంపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. కేవలం ఒక యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే పెండింగ్ ఉన్న `వాలిమై`ని కుదిరితే వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న లేదంటే ఆయుధ పూజ సందర్భంగా అక్టోబర్ 14న రిలీజ్ చేసే దిశగా యూనిట్ ప్లాన్ చేస్తోందట. సో.. రజినీకాంత్, విజయ్ కంటే ముందే అజిత్ ఆగమనం ఉండబోతోందన్నమాట. త్వరలోనే `వాలిమై` రిలీజ్ డేట్ కి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది.
![]() |
![]() |