![]() |
![]() |

మలయాళంలో ఘనవిజయం సాధించిన `అయ్యప్పనుమ్ కోషియుమ్`.. తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి స్టార్ రానా కలిసి నటిస్తున్న ఈ మల్టిస్టారర్ మూవీని సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తుండగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్ కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఇందులో మొత్తం నాలుగు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయట. వాటిలో ఇంట్రవెల్ కి ముందు వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే మరికొంతకాలం వేచిచూడాల్సిందే.
పవన్ కళ్యాణ్ కి జంటగా నిత్యా మీనన్, రానాకి జోడీగా ఐశ్వర్యా రాజేశ్ దర్శనమివ్వనున్న ఈ యాక్షన్ డ్రామా తాలూకు నెక్స్ట్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. కాగా, 2022 సంక్రాంతికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కానుందని వినికిడి.
![]() |
![]() |