![]() |
![]() |

తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన విజయ్ తో టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓ పాన్ ఇండియా సినిమా నిర్మించబోతున్నాడన్న విషయం తెలిసిందే. దీనికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నాడు. వంశీ ఇటీవల విజయ్ ని కలిసి కథ వినిపించగా.. కథ నచ్చిన విజయ్ సినిమా చేయటానికి అంగీకారం తెలిపాడని తెలుస్తోంది. దీంతో వంశీ స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దుతున్నాడని సమాచారం.
భారీ బడ్జెట్ తో రూపొందే ఈ పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే, కీర్తి సురేష్ నటించే తొలి పాన్ ఇండియా మూవీ ఇదే అవుతుంది. కీర్తి సురేష్ గతంలో విజయ్ తో కలిసి భైరవ, సర్కార్ సినిమాల్లో నటించింది. ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే ఇది వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ చిత్రం అవుతుంది.
కాగా, కీర్తి సురేష్ ప్రస్తుతం మహేష్ బాబుకి జోడీగా 'సర్కారువారి పాట' చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు తమిళ్ లో రెండు, మలయాళంలో ఒక సినిమా చేస్తోంది.
![]() |
![]() |