Home  »  News  »  `ఎఫ్ 3`లో సంగీత‌?

Updated : May 26, 2021

``ఒక్క ఛాన్స్`` అంటూ `ఖ‌డ్గం`(2002)లో సీతామ‌హాల‌క్ష్మిగా అల‌రించిన సంగీత గుర్తుండే ఉంటుంది. `ఖ‌డ్గం` కంటే ముందే `ఆశ‌ల సంద‌డి`(1999), `న‌వ్వుతూ బ్ర‌త‌కాలిరా`, `మా ఆయ‌న సుంద‌ర‌య్య‌` (2001) చిత్రాల్లో వేరే స్క్రీన్ నేమ్స్ తో న‌టించిన‌ప్ప‌టికీ రాని గుర్తింపు..  `ఖ‌డ్గం`తోనే ఆమెకి ద‌క్కింది. ఆపై `పెళ్ళాం ఊరెళితే`, `శివ పుత్రుడు`, `సంక్రాంతి` వంటి విజ‌య‌వంత‌మైన‌ చిత్రాల్లో న‌టిగా త‌న‌దైన ముద్ర వేసింది. పెళ్ళ‌య్యాక టాలీవుడ్ కి దూర‌మైన సంగీత‌.. గ‌త ఏడాది సంక్రాంతికి విడుద‌లైన `స‌రిలేరు నీకెవ్వ‌రు`లో ర‌ష్మిక మంద‌న్న త‌ల్లిగా రి-ఎంట్రీ ఇచ్చింది. రి-ఎంట్రీలో మంచి విజ‌యాన్నే సొంతం చేసుకున్న సంగీత‌.. త్వ‌ర‌లో `ఆచార్య‌`లో `లాహే లాహే` పాట‌లో సంప్ర‌దాయ నృత్యాల‌తో క‌నువిందు చేయ‌నుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ లో సంగీత‌కి కీల‌క పాత్ర‌లో న‌టించే అవ‌కాశం ద‌క్కింద‌ట‌. ఆ సినిమా మ‌రేదో కాదు.. `ఎఫ్ 2`కి సీక్వెల్ గా రూపొందుతున్న `ఎఫ్ 3`.  విక్ట‌రీ వెంక‌టేశ్, మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టిస్తున్న ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్టైన‌ర్ లో కామిక‌ల్ రోల్ లో సంగీత ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ట‌. `స‌రిలేరు నీకెవ్వ‌రు` త‌ర‌హాలోనే ఈ పాత్ర‌ని కూడా సంగీత కోసం ఎంతో ప్ర‌త్యేకంగా డిజైన్ చేశాడ‌ట ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. మ‌రి.. ఈ పాత్ర‌తో సంగీతకి ఎలాంటి గుర్తింపు ద‌క్కుతుందో చూడాలి.

కాగా, ఆగ‌స్టు 27న విడుద‌ల కావాల్సిన `ఎఫ్ 3`.. క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా వాయిదా ప‌డ‌నుంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

sangeetha in f3 movie,Actress Sangeetha on board for Anil Ravipudi F3,Sangeetha to join the cast of Venkatesh and Varun Tej starrer F3,Latest News on sangeetha f3 movie






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.