![]() |
![]() |

రానా దగ్గుబాటి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తన సినిమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు పోస్ట్ లు పెడుతూ ఫ్యాన్స్ కు దగ్గరగా ఉంటాడు. అలాగే తాజాగా తను ఒక ఫొటో పోస్ట్ చేశాడు రానా.. అందులో ఇద్దురు చేతులు ఉన్నాయి. ఇంతకీ గాజులతో ఉన్న ఒక అమ్మాయి చెయ్యి, బ్రేస్‌లెట్ ధరించి ఉన్న అబ్బాయి చెయ్యి కలిసి ఉన్న ఆ ఫొటోలో.. ఆ చేతులు ఎవరివబ్బా అన్న సందేహాలు వచ్చే ఉంటాయి. ఇంకెవరివి నటుడు రానా దగ్గుబాటి, నాయిక కాజల్ ది. రానా, కాజల్ కలిసి ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైందని తెలుపుతూ.. ‘నా సూపర్ కో-స్టార్‌ను పరిచయం చేస్తున్నా! కాజల్ అగర్వాల్, సరి కొత్త ఆరంభం’ అని రానా ట్వీట్టర్లో పోస్ట్ చేశారు. కాగా తేజ తన సొంత నిర్మాణ సంస్థ చిత్రం మూవీస్‌పై తెరకెక్కిస్తున్న చిత్రమిది.
![]() |
![]() |