![]() |
![]() |
.jpg)
టాలీవుడ్ లోకి ఎంట్రీ అయిన తక్కువ కాలంలోనే టాప్ యాక్టర్స్ నటిస్తూ బిజీబిజీగా లైఫ్ లీడ్ చేస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ లో అయితే ప్రస్తుతం రకుల్ జాతకం బాగానే ఉంది. ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించేసింది. ఇప్పుడు కోలీవుడ్ లో తన సత్తా చూపించడానికి ప్రిపేర్ అవుతుంది. తమిళంలో తడైయర తక్క సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రకుల్ కు మొదటి సినిమా కలిసిరాలేదు. ఇప్పుడు మరోసారి తన లక్ ను పరీక్షించుకోవడానికి రెడీ అయింది. ఇప్పటికే విశాల్ హీరోగా తెరకెక్కుతున్న తుప్పరివాలన్ సినిమాలో నటిస్తోన్న రకుల్, మరో భారీ ప్రాజెక్ట్కు సైన్ చేసింది. విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సామి 2లో రకుల్ హీరోయిన్గా నటించనుంది. కాగా ఈ బ్యూటి ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న ద్విభాషా చిత్రంతో పాటు, రాం చరణ్ ధృవలోనూ హీరోయిన్గా నటిస్తోంది. మరి ఈసారైనా రకుల్ కు కలిసొస్తుందో లేదో చూద్దాం..
![]() |
![]() |