![]() |
![]() |

ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ఏడ్చేసింది. దీపికా పదుకొనే ఏడవడమేంటి.. అయినా తనను ఎవరు ఏడిపించారబ్బా అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. దీపికా గతంలో డిప్రెషన్ కు గురైన సంగతి తెలిసిందే. దీని గురించి ప్రస్తావించినప్పుడల్లా దీపికా కంటతడి పెడుతూనే ఉంటుంది. అలాగే మరోసారి తన డిప్రెషన్ ను గుర్తుచేసుకుంటూ ఏడ్చేసింది. 'లివ్ లవ్ లాఫ్' అనే తన స్వచ్ఛంద సంస్థ ద్వారా డిప్రెషన్ పై అవగాహనను ప్రారంభించిన సందర్భంగా దీపికా మాట్లాడుతూ.. తాను తీవ్ర మానసిక ఒత్తిడిలోకి పోయిన సందర్భాలు గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకుంది. మా అమ్మగురించి మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. మా అమ్మనాతో లేకుంటే నేను లేను. ఆమె అన్ని వేళలా నాతో ఉంది. అలాగే, నా తండ్రి, సోదరి కూడా. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నాను' అంటూ దీపికా చెప్పింది. అయితే ఆశ్చర్యం ఏంటంటే... ఇన్ని రోజుల నుండి డిప్రెషన్ కు గురయ్యానని చెపుతున్న దీపికా...అసలు ఏ విషయంలో డిప్రెషన్ కు గురైందో ఇప్పటి వరకూ చెప్పలేదు.
![]() |
![]() |