![]() |
![]() |

ఈ దసరాకి రెండు క్రేజీ చిత్రాల టీజర్లు విడుదలయ్యాయి. ఒకటి గౌతమి పుత్ర శాతకర్ణి, రెండోది దృవ. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలున్నాయి. అటు బాలయ్యకు, ఇటు చరణ్‌కూ ఫాన్ ఫాలోయింగ్ విషయంలో ఎలాంటి లోటూ లేదు. దాంతో ఈ టీజర్ల మధ్య పోటీ నెలకొంది. ఎవరిది బాగుందంటూ... లెక్కలు, ఓటింగులు మొదలయ్యాయి. ఈ రెండు టీజర్లలో దృవకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ధృవ టీజర్ స్టైలీష్ గా ఉండడం, చరణ్ లుక్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోవడంతో ఈ పోరులో ధృవ గెలిచినట్టైంది. గౌతమి పుత్ర టీజర్ కూడా బాగానే ఉన్నా.. అంచనాల్ని అందుకోలేకపోయింది. బాలయ్య రెగ్యులర్ లుక్స్, బాహుబలి లైపులో వార్ ఎపిసోడ్స్.. గౌతమి అవకాశాల్ని దెబ్బకొట్టాయి. అయితే ధృవతో పోలిస్తే గౌతమి పుత్ర డైలాగే పవర్‌ఫుల్‌గా తోస్తోంది. యూ ట్యూబ్‌లో ఈ రెండు టీజర్లకూ హిట్స్ బాగున్నాయి. అయితే ఇక్కడ కూడా ధృవ తన ఆధిపత్యం చూపిస్తోంది. ఈ రెండు టీజర్లలో రెండు మిలియన్ల మార్క్ చేరుకొనే దిశగా ముందడుగు వేస్తోంది ధృవ టీజర్. అలా ఈ దసరా పోరులో బాలయ్యపై చరణ్ విజయం సాధించినట్టైంది. మరి.. అసలైన బాక్సాఫీసు పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి.
![]() |
![]() |