![]() |
![]() |

-ఏప్రిల్ 30 నుంచి పెద్ది వాయిదా పడినట్లేనా!
-ప్రమోషన్స్ కూడా స్టార్ట్ కాలేదు
-అలాంటి ఈ టైంలో బుచ్చిబాబు పోస్ట్ వైరల్
-మరి బుచ్చిబాబుకి చరణ్ మరో అవకాశం ఇస్తాడా!
'రైరై రారా' అంటు ఫ్యాన్స్ అందరు 'పెద్ది'(Peddi)రాక కోసం రీగర్ గా వెయిట్ చేస్తున్నారు. సాంగ్స్ ,ప్రమోషన్స్ చూస్తుంటే చరణ్ ని దర్శకుడు బుచ్చిబాబు(Buchi babu)ఒక రేంజ్ లో చూపించాడనే విషయం క్లియర్ కట్ గా అర్ధమవుతుంది. 'ఉప్పెన' తర్వాత నాలుగు సంవత్సరాల పాటు మరో చిత్రం కోసం డైవర్ట్ అవ్వకుండా పెద్ది కోసమే కాచుకొని కూర్చున్నాడు. దీన్ని బట్టి చరణ్(Ram Charan)కి హిట్ ఇవ్వాలనే తన 'కసి'ని అర్ధం చేసుకోవచ్చు. మరి అంతటి పట్టుదలతో ఉన్న బుచ్చిబాబు రీసెంట్ గా చరణ్ తో మరో అవకాశం ఇవ్వండని అడగటం టూ డే టాక్ ఆఫ్ ది వర్డ్ గా నిలిచింది. ఆ డీటెయిల్స్ చూద్దాం.
రెండు రోజుల క్రితం ప్రతిష్టాత్మకమైన 'ఎస్కైర్ మ్యాగజైన్' చరణ్ పిక్ ని తమ ముఖచిత్రంగా ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ సందర్భగా నిన్న చరణ్ సదరు మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. చరణ్ స్టైలిస్ట్ లుక్ లో ఉన్న ఇంటర్వ్యూ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదరు వీడియోపై బుచ్చిబాబు స్పందిస్తు 'సార్ మరో అవకాశం ఇవ్వండనే కామెంట్ చేసాడు.
also read: Ntr: ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ టైటిల్ ఇదే! మీరు ఇదే అనుకున్నారా!
మరి ఫ్యాన్స్ ఊరుకుంటారా.. మళ్ళీ మీ ఇద్దరి కాంబోలో మూవీ తెరకెక్కితే అంతకంటే అదృష్టమా చెప్పండని కామెంట్స్ తో సోషల్ మీడియాకి సరికొత్త ఎనర్జీ తీసుకొస్తున్నారు. పనిలో పనిగా పలానా జోనర్స్ లో చెయ్యమని సలహాలు ఇవ్వడం కూడా స్టార్ట్ చేసారు. మరి తధాస్తు దేవతులు వాళ్ళ కామెంట్స్ కి తధాస్తు చెప్పారేమో చూడాలి. ఏప్రిల్ 30 నుంచి పెద్ది దూరం జరిగినట్టుగా టాక్. ఏప్రిల్ మిడిల్ లోకి వచ్చినా ఇంతవరకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోవడం దూరం అనే మాటకి బలాన్ని ఇస్తున్నాయి.

![]() |
![]() |