![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కెరీర్‌లో 'బద్రి' సినిమా ఒక మైలురాయి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాతోనే రేణూ దేశాయ్ (Renu Desai) టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్ ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
షరతులతోనే సినిమాల్లోకి..
నిజానికి రేణూ దేశాయ్‌కు నటి కావాలనే కోరిక మొదట్లో లేదట. ఆమెకు డాక్టర్ అవ్వాలని ఉండేది. మోడలింగ్‌లో ఉన్నప్పుడు పూరీ జగన్నాథ్ ఆమెను చూసి 'బద్రి' కోసం సంప్రదించారు. అయితే సూటిగా మాట్లాడే స్వభావం వల్ల, సినిమా ఇండస్ట్రీ తనకు సెట్ కాదని ఆమె భావించేవారట. అందుకే దర్శకుడు పూరీకి కొన్ని షరతులు పెట్టానని ఆమె తెలిపారు. తన పాత్రకు సంబంధించిన కాస్ట్యూమ్స్ తానే సెలెక్ట్ చేసుకుంటానని, తన ఇష్టప్రకారం మేకప్ ఉంటుందని చెప్పగా పూరీ అందుకు అంగీకరించారట. అలా వెన్నెల పాత్రలో రేణూ దేశాయ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ కాంబినేషన్ లో వచ్చిన 'బద్రి' సినిమా అప్పట్లో యూత్ లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. ముఖ్యంగా అందులోని డైలాగులు, సాంగ్స్ ఇప్పటికీ ఎంతో ఫేమస్. ఆ తర్వాత వీరిద్దరూ 'జానీ' సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. కాస్ట్యూమ్ డిజైనర్ వర్క్ చేస్తున్నానని, ఎవరూ సెలెక్ట్ కాకపోవడంతో చివరి నిమిషంలో హీరోయిన్ గా ఎంపికయ్యాయని రేణూ దేశాయ్ తెలిపారు.
'బద్రి' తర్వాత 'జానీ' సినిమాలో నటించిన రేణూ, చాలా కాలం వెండితెరకు దూరంగా ఉన్నారు. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో ఆమె రీ-ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె రైతుల సమస్యల నేపథ్యంలో ఒక సినిమాను రూపొందించే పనిలో ఉన్నారు.
![]() |
![]() |