![]() |
![]() |

-విష్ణుప్రియపై కేసు నడుస్తున్న విషయం తెలిసిందే
-మరి తను ఏం చెప్తుంది
-మళ్ళీ కొత్త వీడియో వైరల్
-చివరకి ఏం తేలనుంది
ప్రముఖ నటి, యాంకర్ విష్ణుప్రియ(Vishnu priya)వ్యవహారం ఇప్పుడు సినీ సర్కిల్స్ తో పాటు రెండు తెలుగు రాష్టాల్లో హాట్ టాపిక్ అయ్యి కూర్చుంది. విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర ఫొటోలని షేర్ చేస్తూ, సబ్స్క్రిప్షన్ పేరుతో డబ్బు వసూలు చేస్తోందని,తన ఇన్‌స్టా అకౌంట్‌ని బ్లాక్ చేసి , వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని ఏపికి చెందిన ఏఐఎస్ఎఫ్ నాయకులు సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చెయ్యడమే ప్రధాన కారణం. దీంతో ప్రస్తుతం ఆమెపై ఎంక్వైరీ నడుస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో విష్ణుప్రియ తన బాడీపై చేసిన కామెంట్స్‌కి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
ఒక యాంకర్ విష్ణు ప్రియతో చాలా ట్రెడిషనల్‌గా, మంచి తెలుగు అమ్మాయిలా కనిపిస్తున్నారు. కానీ మీ పోస్ట్‌లు మాత్రం చాలా హాట్‌గా, బోల్డ్‌గా, అబ్బాయిలని రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయి కదా, మీ కాస్ట్యూమ్స్ కూడా అదే విధంగా ఉంటున్నాయని అడిగింది. విష్ణు ప్రియ మాట్లాడుతు నేను మోడలింగ్ చేస్తాను.దీంతో ఫోటోషూట్ చేయాల్సి ఉంటుంది. అందుకు నా పోర్ట్‌ఫోలియో రెడీగా ఉండాలి. అందుకే దేవుడిచ్చిన బాడీని ఔట్‌ఫిట్స్‌తో, నేను ఎంతవరకు కంఫర్టబుల్‌గా ఉంటానో అంతవరకు చేస్తు ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేయడం కోసం ఉపయోగిస్తున్నాను. ఒక టెంప్లేట్లాగా కూడా ఉపయోగిస్తున్నాను.
Also read: Rajinikanth: మళ్ళీ దర్శకుడు మారాడా! ఏం జరుగుతుంది అసలు
అదంతా నేను చేసే వర్క్‌లో భాగం మాత్రమే. నిజ జీవితంలో నేను చాలా ట్రెడిషనల్‌గానే ఉండటానికి ఇష్టపడతాను. ట్రెడిషనల్‌గా రెడీ అవ్వడం అంటే మళ్ళీ ఆల్మోస్ట్ అబ్బాయిలాగే ఒక ప్యాంటు, షర్టు వేసుకుంటాను.మరీ 'గర్లీ' గా ఉండటం ఇష్టం ఉండదు. రియల్ గా స్లీవ్‌లెస్, స్ట్రాప్‌లెస్ డ్రెస్సులు వేసుకోను. నాలోని ఆ సైడ్ కేవలం పని కోసమే స్విచ్ ఆన్ అవుతుంది. పని అయిపోయాక మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. రియల్ లైఫ్‌లో నేను మీతో ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నానో అలాగే ఉంటానని విష్ణుప్రియ మాట్లాడింది. మరి ఆమె చెప్పిన మాటల తాలూకు ప్రెజెంట్ వీడియోనో కాదో గాని ప్రెజెంట్ బాగానే వైరల్ అవుతుంది.
![]() |
![]() |