![]() |
![]() |

తన గత చిత్రం `ఎ1 ఎక్స్ ప్రెస్`తో థియేటర్స్ లో సందడి చేశాడు యువ కథానాయకుడు సందీప్ కిషన్. హాకీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామాతో నటుడిగా మరోమారు మెప్పించాడు.
ఇదిలా ఉంటే.. తక్కువ గ్యాప్ లో రెండు వరుస చిత్రాలతో ఓటీటీలో ఎంటర్టైన్ చేయనున్నాడు ఈ యంగ్ హీరో. ఆ వివరాల్లోకి వెళితే.. చాన్నాళ్ళ క్రితమే సందీప్ కిషన్ పూర్తిచేసిన `నరగాసురన్` అనే తమిళ చిత్రం ఈ నెలలోనే `సోనీ లైవ్` ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. ఇందులో సందీప్ తో పాటు శ్రియ, అరవింద్ స్వామి వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రల్లో నటించారు. తెలుగులోనూ ఈ ఇంట్రెస్టింగ్ మూవీ.. `నరకాసురుడు` పేరుతో అందుబాటులోకి రానుందని బజ్.
కాగా సందీప్ కిషన్, రెజీనా, వెంకట్ ప్రభు, ప్రియా భవానీ శంకర్, హరీశ్ కళ్యాణ్, జననీ అయ్యర్ వంటి తారాగణంతో తెరకెక్కిన తమిళ ఆంథాలజీ `కసడ తపర` కూడా `సోనీ లైవ్`లో స్ట్రీమ్ కానుందని కోలీవుడ్ టాక్. జూలై నెలలో ఈ క్రేజీ ఆంథాలజీ స్ట్రీమ్ కానుందట.
మరి.. `నరగాసురన్`, `కసడ తపర`తో సందీప్ కి ఎలాంటి గుర్తింపు దక్కుతుందో చూడాలి.
![]() |
![]() |