![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన క్రాక్ తో అందాల తార శ్రుతి హాసన్ రి-ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కావాల్సిన ఈ కాప్ డ్రామా.. ఇప్పుడు జనవరి 9కి ప్రీ పోన్ అయింది.
ఇదిలా ఉంటే.. తెలుగునాట శ్రుతి హాసన్ ఎంట్రీ, రి- ఎంట్రీ చిత్రాలకు సంబంధించి ఓ కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేమిటంటే.. సంక్రాంతి సీజన్ నే టార్గెట్ చేసుకున్న ఈ రెండు సినిమాల్లోనూ లేడీ విలన్స్ ఉన్నారు.
ఆ వివరాల్లోకి వెళితే.. 2011లో విడుదలైన శ్రుతి టాలీవుడ్ ఎంట్రీ మూవీ అనగనగా ఓ ధీరుడులో ప్రతినాయకురాలు ఐరేంద్రిగా లక్ష్మీ మంచు నటిస్తే.. పదేళ్ళ తరువాత ఇప్పుడు శ్రుతి రి-ఎంట్రీ మూవీ క్రాక్ లో లేడీ విలన్ జయమ్మగా వరలక్ష్మీ శరత్ కుమార్ దర్శనమివ్వనుంది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. శ్రుతితో పాటు ఆమె ఎంట్రీ, రి-ఎంట్రీ చిత్రాల్లో విలన్స్ గా నటించిన నటీమణులు.. ఈ ముగ్గురు కూడా సీనియర్ హీరోలకు నటవారసురాళ్ళే.
కమల్ హాసన్ తనయ అనే ట్యాగ్ తో శ్రుతి వెండితెరపై వెలుగులు పంచితే.. మోహన్ బాబు నటవారసురాలిగా లక్ష్మీ మంచు, శరత్ కుమార్ కూతురు అనే ట్యాగ్ తో వరలక్ష్మి చిత్ర రంగ ప్రవేశం చేశారు.
మరి.. అనగనగా ఓ ధీరుడు ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో.. క్రాక్ అయినా రైట్ ట్రాక్ లో వెళుతుందేమో చూడాలి.
![]() |
![]() |