Home  »  News  »  గంగా హాస్పిటల్ నుంచి అయ్యప్ప స్వామి ఆలయానికి రామ్ చరణ్.!

Updated : Jul 29, 2026

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు బిగ్ రిలీఫ్ ఇచ్చే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల కుడిచేతి మణికట్టు సర్జరీ చేయించుకున్న అనంతరం, రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి కోయంబత్తూరులోని ప్రసిద్ధ అయ్యప్ప స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే ఈ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

'పెద్ది' షూటింగ్ సమయంలో రామ్ చరణ్ కుడిచేతి మణికట్టుకు తీవ్ర గాయమైంది. అయితే సినిమా రిలీజ్, ప్రమోషన్స్ ను దృష్టిలో ఉంచుకొని.. చరణ్ అప్పుడు సర్జరీని తాత్కాలికంగా వాయిదా వేశారు. రీసెంట్ గా తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ప్రముఖ గంగా హాస్పిటల్ లో సర్జరీ చేయించుకున్నారు.

సర్జరీ విజయవంతం కావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రామ్ చరణ్, నల్లటి సాంప్రదాయ దుస్తుల్లో కుడిచేతికి సపోర్టివ్ స్లింగ్ ధరించి అయ్యప్ప ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో ఎంతో వినయంతో స్వామివారికి నమస్కరిస్తూ పూజల్లో పాల్గొన్నారు. ఇదే సమయంలో ఉపాసన ఆలయ ఆవరణలోని గోశాలలో ఆవులకు పండ్లు తినిపిస్తూ గోసేవ చేయడం చూసేవారిని విశేషంగా ఆకట్టుకుంది. 

సర్జరీ అనంతరం డాక్టర్లు రామ్ చరణ్ కు కనీసం 8 వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ విశ్రాంతి సమయంలో ఫిజియోథెరపీ, స్ట్రక్చర్డ్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ కొనసాగనుంది. వైద్యుల నుండి పూర్తి క్లియరెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఆయన మళ్లీ కెమెరా ముందుకు రానున్నారు.

విశ్రాంతి అనంతరం రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న తన తదుపరి భారీ ప్రాజెక్ట్ (RC17) షూటింగ్ లో పాల్గొననున్నారు. 

 

 

Ram Charan, Upasana, Ayyappa Swamy Temple, Coimbatore

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.