Home  »  News  »  'స్పిరిట్'లో ప్రభాస్ షర్ట్‌లెస్ యాక్షన్ బ్లాక్.. సందీప్ రెడ్డి వంగా మార్క్ విధ్వంసం.!

Updated : Jul 29, 2026

స్క్రీన్ పై ప్రభాస్ కనిపిస్తేనే ఆ మాస్ వైబ్ వేరు.. మరి అదే ప్రభాస్ షర్ట్ తీసి, రక్తం చిందిస్తూ, అసలైన వైలెంట్ యాక్షన్ మోడ్‌లోకి దిగితే బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి? ఊహించుకోవడానికే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి కదా. సరిగ్గా ఇదే రా, రస్టిక్, అన్‌ఫిల్టర్డ్ యాక్షన్‌ను మన ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'స్పిరిట్' గురించి ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఒక మైండ్ బ్లాకింగ్ షర్ట్‌లెస్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశారనే వార్త ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఒక వైపు జైలు బ్యాక్‌డ్రాప్, మరోవైపు ఫుల్ రా అండ్ ఇంటెన్స్ ఫైట్స్.. డార్లింగ్ లాంగ్ హెయిర్, గాయపడిన ముఖంతో ఒక పవర్‌ఫుల్ అండ్ వైలెంట్ కాప్‌గా పిచ్చెక్కిస్తున్నాడని సమాచారం.

ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచీ అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ లో ప్రభాస్ లుక్ చూసి అభిమానులకు పూనకాలు వచ్చేశాయి. ఇప్పుడు దానికి పదిరెట్లు ఉండేలా ఈ యాక్షన్ సీన్లను సందీప్ రెడ్డి వంగా డిజైన్ చేశారట.

ఈ మోస్ట్ వైలెంట్ యాక్షన్ బ్లాక్ చేసిన ప్రభాస్, ఇప్పుడు తన ఫోకస్ ని హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న పిరియాడిక్ డ్రామా 'ఫౌజీ'పైకి షిఫ్ట్ చేశారు. ఈ సినిమా 2026 డిసెంబర్ 3న విడుదల కానుండగా, 'స్పిరిట్' మాత్రం 2027 మార్చిలో బిగ్ స్క్రీన్స్ పైకి రానుంది. ఈ గ్యాప్‌లోనే 'స్పిరిట్' షూటింగ్ మిగతా భాగాన్ని కూడా సందీప్ శరవేగంగా పూర్తి చేయబోతున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన తృప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏదేమైనా, ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్, సందీప్ మార్క్ మేకింగ్‌తో కలిసి ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడటానికి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

 

 

Spirit Movie, Prabhas Shirtless, Fight Sequence, Sandeep Reddy Vanga

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.