![]() |
![]() |
.webp)
చార్మింగ్ స్టార్ శర్వానంద్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఆయన సాఫ్ట్ రోల్స్, లవ్ స్టోరీస్, క్లాస్ ఎంటర్‌టైనర్స్. కానీ, ఈసారి కథ వేరేలా ఉండబోతోంది. శర్వానంద్ తన కెరీర్‌లోనే ఇంతవరకు ఎప్పుడూ చూడని ఒక వైల్డెస్ట్ అండ్ 'నెవర్ బిఫోర్ మాస్ అవతార్'లో దర్శనమివ్వబోతున్నారు. మాస్ పల్స్ బాగా తెలిసిన డైరెక్టర్ సంపత్ నంది, శర్వానంద్‌లోని ఆన్‌స్క్రీన్ మాస్ ఎనర్జీని పీక్స్ రేంజ్‌లో వాడుకోవడానికి గట్టి స్కెచ్ వేశారు.
ఈ సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం మేకర్స్ పడిన కష్టం, పెట్టిన ఎఫర్ట్ సాధారణమైనది కాదు. కేవలం ఆ సీక్వెన్స్ పర్ఫెక్ట్‌గా డిజైన్ చేయడానికే ఏకంగా 3 నెలల సమయం కేటాయించారు. ఆ తర్వాత 800 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులతో భారీ సెట్‌లో సుదీర్ఘంగా 22 రోజుల పాటు ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించి గ్రాండ్‌గా పూర్తి చేశారు. ఈ క్లైమాక్స్ థియేటర్లలో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ ఇస్తుందని టీమ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది.
మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడంలో సంపత్ నందికి ఒక ప్రత్యేకమైన ట్రేడ్‌మార్క్ స్టైల్ ఉంది. ఆ మార్క్ మాస్ మ్యాజిక్‌కు శర్వానంద్ డిఫరెంట్ మేకోవర్ తోడవ్వడంతో భోగి ప్రాజెక్ట్ పై ట్రేడ్ వర్గాల్లోనూ, ఫ్యాన్స్‌లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
Sharwanand, Bhogi Movie, Climax Shoot, Sampath Nandi
![]() |
![]() |