Home  »  News  »  Sonali Bendre: సొనాలీ బింద్రే ఫిట్ నెస్ సీక్రెట్.. ఆటోఫాగీ వెనుక అసలు నిజాలివే

Updated : Jul 29, 2026

 

సోనాలి బింద్రే(sonali bendre).. ఈ పేరు వింటే చాలు ఈ సినిమాలో సోనాలి  సూపర్ గా పెర్ఫార్మ్ చేసిందంటే, ఈ సినిమాలో చేసిందని పలు సినిమాల్ని ఉదాహరణగా చూపిస్తూ అభిమానులు గొడవ ఆడుకునే పరిస్థితి అంతలా తన పెర్ఫార్మ్ తో మెస్మరైజ్ చేసి పడేసింది. హిట్ శాతం కూడా ఎక్కువే. 2018లో మెటాస్టాటిక్ క్యాన్సర్ బారిన పడినప్పుడు వైద్యులు ఆమె బతికే అవకాశం కేవలం 30 శాతం మాత్రమే ఉందని చెప్పారు. ఆ  పరిస్థితుల నుంచి ధైర్యంతో పోరాడి క్యాన్సర్‌ని  దిగ్విజయంగా జయించి తిరిగి సాధారణ జీవితంలోకి వచ్చారు.

ఇక సినీ తారలు పాటించే ఆరోగ్య సూత్రాలు,  తిండి విధానాలు, నిద్ర మరియు వ్యాయామ నియమాలు అభిమానులతో పాటు సామాన్యుల్లో  ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. తాజాగా బాలీవుడ్ నటి సొనాలీ బింద్రే తన ఫిట్‌నెస్ మరియు ఆరోగ్య రహస్యాన్ని వెల్లడిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హెల్త్ మరియు వెల్నెస్ ప్రపంచంలో చాలా పెద్ద చర్చకి దారి తీస్తున్నాయి. ఆమె మాట్లాడుతు క్యాన్సర్ రికవరీ ప్రయాణంలో, ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించడంలో 'ఆటోఫాగీ' అనే విధానం నాకు ఎంతగానో సహాయపడింది. రోజులో ఏకంగా 18 నుంచి 20 గంటల పాటు అత్యంత కఠినమైన ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ నిబంధనలని  పాటిస్తాను. అంటే ఏమి తినకుండా ఉంటాను అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో  20 గంటల పాటు ఆహారం తీసుకోకుండా కడుపు మాడ్చుకుంటే శరీరంలోని కణాలు నిజంగానే రీసైకిల్ అయి యవ్వనంగా మారతాయా, లేదా రోగాలు దూరమవుతాయా అనే సందేహాలు చాలా మందిలో  మొదలయ్యాయి.

ముందుగా  సైంటిఫిక్ పరిభాషలో ఆటోఫాగీ అంటే ఏమిటో అర్థం చేసుకోవడం చాలా అవసరం. సాధారణంగా మన ఇంట్లో పనికిరాని పాత వస్తువులు లేదా చెత్త పేరుకుపోతే వాటిని బయట పడేయడమో లేక రీసైక్లింగ్‌కు పంపడమో చేస్తాం కదా! సరిగ్గా మన శరీరం కూడా కణాల స్థాయిలో ప్రతిరోజూ ఇదే పని చేస్తుంది. మన శరీర కణాల్లో దెబ్బతిన్న ప్రోటీన్లు, పాతబడిపోయిన భాగాలు, పనికిరాని వ్యర్థ పదార్థాలను సేకరించి, వాటిని విచ్ఛిన్నం చేసి, తిరిగి నూతన శక్తిగా మార్చుకునే సహజసిద్ధమైన అద్భుత ప్రక్రియనే జీవశాస్త్రంలో ఆటోఫాగీ అంటారు. ఈ సహజ ప్రక్రియ ద్వారా శరీరంలో వృద్ధాప్య ఛాయలు ఆలస్యమవుతాయని, రోగనిరోధక శక్తి అపారంగా పెరుగుతుందని, అలాగే నరాల బలహీనత వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు దరిచేరకుండా నిరోధించవచ్చని కొన్ని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

అయితే 20 గంటల పాటు సుదీర్ఘ ఉపవాసం ఉండగానే అందరి శరీరంలోనూ వెంటనే ఆటోఫాగీ స్విచ్ ఆన్ అయిపోతుందనే భావన ఒక భ్రమ మాత్రమేనని ఆరోగ్య నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధిక బరువుతో బాధపడేవారు, ఫ్యాటీ లివర్, ఇన్సులిన్ నిరోధకత, బిపి వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ కొంతవరకు మేలు చేస్తుందని పరిశోధనల్లో తేలినప్పటికీ, దీనికోసం 20 గంటల పాటు కఠినంగా పస్తులుండాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. రోజులో 8 నుంచి 10 గంటల ఉపవాస వ్యవధి సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరి వయస్సు, జీవక్రియ రేటు, జన్యు నిర్మాణం, శారీరక శ్రమ మరియు ఉపవాసానికి ముందు తీసుకున్న ఆహారాన్ని బట్టి ఆటోఫాగీ ప్రక్రియ ఆధారపడి ఉంటుందని, అందరికీ ఒకే రకమైన టైమర్ పనిచేయదని హెచ్చరిస్తున్నారు.


Also read: kangana ranaut: కంగనా రనౌత్‌పై ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. సంపాదించింది ఇదే


ఆటోఫాగీ అనేది జీవశాస్త్రపరంగా ఎంతో విశిష్టమైన ప్రక్రియ అయినప్పటికీ, అది ఒకే ఒక్క రోజులో లేదా సడెన్ షార్ట్‌కట్‌తో అందే ఆరోగ్యం కాదని గ్రహించాలి. శరీరాన్ని అతిగా శ్రమకు గురిచేసి గంటల తరబడి పస్తులుండటం కంటే క్రమం తప్పకుండా రోజూ వ్యాయామం చేయడం, రోజుకు 7 నుంచి 8 గంటల పాటు ప్రశాంతమైన నిద్రపోవడం, మానసిక ఒత్తిడి లేని జీవనశైలిని అలవర్చుకోవడం మరియు పోషకాహారం తీసుకోవడం ద్వారానే శాశ్వత ఆరోగ్యం లభిస్తుంది. సెలబ్రిటీలు అనుసరించే హెల్త్ ట్రెండ్స్ వినడానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, సరైన డాక్టర్ సలహా లేకుండా ఎటువంటి కఠిన ప్రయోగాలు చేయకపోవడమే మీ శరీరానికి అత్యంత సురక్షితం.

Sonali Bendre,  Autophagy Process,






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.