![]() |
![]() |
.webp)
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన `గ్యాంగ్ లీడర్` చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది క్యూట్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్. ఆపై శర్వానంద్ `శ్రీకారం`లోనూ సందడి చేసింది. అయితే, ఈ రెండు సినిమాలు కూడా ప్రియాంకకి ఆశించిన విజయాన్ని అందివ్వలేకపోయాయి. అంతేకాదు.. వీటికంటే ముందు కన్నడలో నటించినా అమ్మడికి సేమ్ టు సేమ్ సిట్యుయేషన్.
అయితే, తమిళంలో మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకుంటోంది ప్రియాంక. ఇప్పటికే కోలీవుడ్ డెబ్యూ మూవీ `డాక్టర్`తో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రియాంక.. రీసెంట్ గా సూర్య సరసన `ఈటీ`లో దర్శనమిచ్చింది. అంతేకాదు.. త్వరలో `డాక్టర్` స్టార్ శివ కార్తికేయన్ కి జంటగానే `డాన్`తో పలకరించబోతోంది. మే 13న ఈ యాక్షన్ కామెడీ డ్రామా రిలీజ్ కానుంది. కాగా, సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త చిత్రంలోనూ ప్రియాంక ఓ ముఖ్య పాత్రలో నటించబోతోందని సమాచారం. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. మరో క్రేజీ ప్రాజెక్ట్ లోనూ నటించే ఛాన్స్ దక్కించుకుందట ప్రియాంక. `జయం` రవి హీరోగా రూపొందనున్న ఈ సినిమాలో అభినయానికి ఆస్కారమున్న పాత్రలో ఈ ముద్దుగుమ్మ అలరించనుందట. త్వరలోనే `జయం రవి 30`లో ప్రియాంక ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
![]() |
![]() |