![]() |
![]() |

'కేజీఎఫ్ చాప్టర్-2' తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.78 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ 18 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అందుకుంది. అయితే ఏరియాల వారీగా చూస్తే మాత్రం ఈ మూవీ ఇంకా అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ సాధించలేదు.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం 18 వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 97 లక్షల షేర్ వసూలు చేసిన కేజీఎఫ్-2 ఇప్పటిదాకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి 79.27 కోట్ల షేర్(127.75 కోట్ల గ్రాస్) రాబట్టింది. నైజాంలో 25 కోట్ల బిజినెస్ చేయగా 18 రోజుల్లో 40.93 కోట్ల షేర్ కలెక్ట్ చేసి భారీ లాభాలను రాబడుతోంది. అయితే ఆంధ్రా, సీడెడ్ లో మాత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించలేదు. సీడెడ్ 14 కోట్ల బిజినెస్ చేసిన మూవీ ఇప్పటిదాకా 11.12 కోట్ల షేర్ సాధించింది. ఆంధ్రాలో ఓవరాల్ గా 39 కోట్ల బిజినెస్ చేయగా 18 రోజుల్లో 27.22 కోట్ల షేర్ రాబట్టింది.
18 రోజుల్లో కేజీఎఫ్-2 ఉత్తరాంధ్రలో 7.29 కోట్లు(బిజినెస్ 10 కోట్లు), ఈస్ట్ గోదావరి 5.42 కోట్లు(బిజినెస్ 7 కోట్లు), వెస్ట్ గోదావరి 3.38 కోట్లు(బిజినెస్ 6 కోట్లు), గుంటూరు 4.47 కోట్లు(బిజినెస్ 7 కోట్లు), కృష్ణ 4 కోట్లు(బిజినెస్ 6 కోట్లు), నెల్లూరు 2.66 కోట్ల(బిజినెస్ 3 కోట్లు) షేర్ రాబట్టింది. ఆంధ్రప్రదేశ్ లో కేజీఎఫ్-2 మూవీ బయ్యర్లకు స్వల్ప నష్టాలను మిగిల్చే అవకాశముంది.
వరల్డ్ వైడ్ గా 345 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ 18 రోజుల్లో 512.72 కోట్ల షేర్(1039.55 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసి ఓవరాల్ గా ఇప్పటిదాకా బయ్యర్లకు 165 కోట్లకు పైగా ప్రాఫిట్స్ మిగిల్చింది. 18 రోజుల్లో కర్ణాటకలో 92.55 కోట్లు(100 కోట్లు బిజినెస్), తెలుగు రాష్ట్రాల్లో 79.27 కోట్లు(78 కోట్లు బిజినెస్), తమిళనాడు 43.25 కోట్లు(27 కోట్లు బిజినెస్), కేరళ 25.40 కోట్లు(10 కోట్లు బిజినెస్), హిందీ+రెస్టాఫ్ ఇండియా 187.60 కోట్లు(100 కోట్లు బిజినెస్), ఓవర్సీస్ 84.65 కోట్ల(30 కోట్లు బిజినెస్) షేర్ రాబట్టింది.
![]() |
![]() |