![]() |
![]() |

విక్టరీ వెంకటేశ్ కెరీర్ లో పలు విజయవంతమైన ప్రేమకథా చిత్రాలు ఉన్నాయి. వాటిలో `ప్రేమించుకుందాం..రా!` ఒకటి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ లవ్ స్టోరితోనే అగ్ర దర్శకుడు జయంత్ సి. పరాన్జీ కెప్టెన్ గా తొలి అడుగేశారు. అలాగే, అందాల తార అంజలా ఝవేరి కథానాయికగా తెలుగునాట మొదటిసారిగా సందడి చేసింది. ఇందులో గిరి (వెంకటేశ్), కావేరి (అంజలా ఝవేరి) పాత్రల మధ్య సాగే క్యూట్ అండ్ స్వీట్ లవ్ స్టోరి అప్పటి కుర్రకారుని ఫిదా చేసింది. జయప్రకాశ్ రెడ్డి, శ్రీహరి, చంద్రమోహన్, ఆహుతి ప్రసాద్, పరుచూరి వెంకటేశ్వరరావు, గోకిన రామారావు, రఘునాథ్ రెడ్డి, అన్నపూర్ణ, బాబూ మోహన్, బ్రహ్మానందం, వేణుమాధవ్, ఉత్తేజ్, సుధ, రమాప్రభ, రజిత, కల్పనా రాయ్, బెంగళూరు పద్మ, బేబి నిహారిక, మాస్టర్ ఆనంద్ వర్ధన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాలో అల్ఫోన్సా ఓ గీతం కోసం తళుక్కున మెరిసింది.
మహేశ్, మణిశర్మ సంగీతమందించిన `ప్రేమించుకుందాం.. రా!`కి `సిరివెన్నెల` సీతారామ శాస్త్రి, భువనచంద్ర, చంద్రబోస్ సాహిత్యమందించారు. ``ఓ పనైపోతుంది బాబు`, `మేఘాలే తాకింది``,``సూర్య కిరిటమే``, ``అలా చూడు ప్రేమలోకం``, ``చిన్ని చిన్ని గుండెలో``, ``పెళ్ళికళ వచ్చేసిందే బాల``.. ఇలా ఇందులోని పాటలన్నీ విశేషాదరణ పొందాయి. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు సమర్పణలో డి. సురేశ్ బాబు నిర్మించిన `ప్రేమించుకుందాం.. రా!`.. 1997 మే 9న విడుదలై 57 కేంద్రాలలో 50 రోజులు, 50 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శితమైంది. నేటితో ఈ మ్యూజికల్ సెన్సేషన్ పాతికేళ్ళు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |