![]() |
![]() |

గత వారం విడుదలై ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర హల్‌చల్ చేస్తోన్న 'జాతిరత్నాలు' సినిమాని సూపర్‌స్టార్ కృష్ణ వీక్షించారు. దీనికి సంబంధించిన ఫొటోను సీనియర్ నటుడు నరేశ్ షేర్ చేశారు. కృష్ణ, తను కలిసి సోఫాలో కూర్చొని ఉన్న ఫొటోను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన నరేశ్, "సూపర్‌స్టార్‌తో కలిసి 'జాతిరత్నాలు' వీక్షించాను. ఈ సినిమా ఒక హ్యూమర్ బాంబ్. ఆ తరహా చిత్రాల్లో అది ఆల్ టైమ్ టాప్ గ్రాసర్ అయ్యిందంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. నవీన్ పోలిశెట్టి, డైరెక్టర్ అనుదీప్, ప్రొడ్యూసర్ నాగ్ అశ్విన్, స్వప్న సినిమా టీమ్‌కు అభినందనలు." అని ఆయన రాసుకొచ్చారు.
ఈ మూవీలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తండ్రి పాత్రలో నరేశ్ మెప్పించారు. హీరో నవీన్ పోలిశెట్టిని చూసినప్పుడల్లా ఫ్రస్ట్రేట్ అయ్యే పాత్రలో ఆయన కూడా తన వంతు హాస్యాన్ని అందించారు.
నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి టైటిల్ రోల్స్ పోషించిన 'జాతిరత్నాలు' మూవీ మార్చి 11న విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్టయింది. ఇప్పటికే బయ్యర్లకు రూ. 20 కోట్లకు పైగా ప్రాఫిట్‌ను అందించి, చరిత్ర సృష్టించింది. ఒక చిన్న సినిమా ఈ రేంజ్ హిట్టవడంతో ఇండస్ట్రీ వర్గాలే ఆశ్చర్యానికి గురవుతున్నాయి.

![]() |
![]() |