![]() |
![]() |

అలనాటి కథానాయికలను తన చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటింపజేయడం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ శైలి. నదియా (అత్తారింటికి దారేది, అఆ), స్నేహ (సన్నాఫ్ సత్యమూర్తి), ఖుష్బూ (అజ్ఞాతవాసి), దేవయాని - సితార - ఈశ్వరీ రావ్ (అరవింద సమేత), టబు (అల వైకుంఠపురములో).. ఇలా పలువురు నిన్నటి తరం కథానాయికలు త్రివిక్రమ్ చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో అలరించారు.
కట్ చేస్తే.. తన నెక్స్ట్ వెంచర్ `యన్టీఆర్ 30`లోనూ ఇదే తీరుని కొనసాగించబోతున్నారట త్రివిక్రమ్. యంగ్ టైగర్ యన్టీఆర్ హీరోగా రూపొందనున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో రెండు సార్లు `జాతీయ ఉత్తమ నటి`గా పురస్కారాలను అందుకున్న అర్చనని ఓ కీలక పాత్రలో నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారట. అంతేకాదు.. తారక్ కి తల్లి పాత్రలో అర్చన దర్శనమివ్వనున్నట్లు బజ్. త్వరలోనే `యన్టీఆర్ 30`లో అర్చన ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
కాగా తమిళ చిత్రం `వీడు` (1987), తెలుగు సినిమా `దాసి` (1988)కి గానూ బ్యాక్ టు బ్యాక్ ఇయర్స్ లో అర్చన.. బెస్ట్ యాక్ట్రస్ గా నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు. `యన్టీఆర్ 30`లో అర్చన నటించడం ఖాయమైతే సుదీర్ఘ విరామం తరువాత తను నటించే తెలుగు చిత్రమిదే అవుతుంది.
![]() |
![]() |