
'రాధేశ్యామ్' రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ పీరియాడిక్ లవ్ స్టోరీ ఈ నెల 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకోగా.. తాజాగా విడుదలైన కొత్త ట్రైలర్ అంతకుమించి అనేలా ఉంది. నిమిషం నిడివి గల ఈ ట్రైలర్ విజువల్ వండర్ అంటూ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.
"మనం ఆలోచిస్తున్నామని భ్రమ పడతాం. మన ఆలోచనలు కూడా ముందే రాసి ఉంటాయి" అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్ లోని విజువల్స్ హాలీవుడ్ సినిమా స్థాయిలో ఉన్నాయి. ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పామిస్ట్ గా కాన్ఫిడెన్స్, ప్రేమికుడిగా ఎమోషన్ చక్కగా చూపించాడు. "ప్రేమకి, విధికి మధ్య జరిగే యుద్ధమే" అంటూ రాజమౌళి చెప్పే వాయిస్ తో ట్రైలర్ ముగిసింది. ఈ రిలీజ్ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది అనడంలో సందేహం లేదు.

యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి రాధా కృష్ణ కుమార్ దర్శకుడు. ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా, తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.






