![]() |
![]() |

తెలుగునాట తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సొంతం. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు.. ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. తన కెరీర్ లో ఎన్నో రికార్డులను సృష్టించారు పవర్ స్టార్. అలాంటి పవన్.. ఒక విషయంలో మాత్రం వెనకబడిపోయారు. తన తోటి స్టార్స్ అంతా రూ.100 కోట్ల షేర్ క్లబ్ లో చేరారు. ఈ ఫీట్ ని అందరికంటే ముందు సాధించగల సత్తా ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా సాధించలేదు. దానికి కారణం ఆయన గత దశాబ్ద కాలంగా రాజకీయాలతో బిజీగా ఉండటమనే చెప్పవచ్చు.
గత పదేళ్లలో పవన్ నుంచి తక్కువ సినిమాలే వచ్చాయి. పైగా ఆయన స్టార్డంకి తగ్గ సినిమాలు పెద్దగా రాలేదు. ఇది చాలదు అన్నట్లు.. టికెట్ ధరలు తక్కువ కారణంగా 'భీమ్లా నాయక్' వంటి సినిమాలు వంద కోట్ల షేర్ కి అడుగు దూరంలో ఆగిపోయాయి. ఇక ఇటీవల విడుదలైన 'హరి హర వీరమల్లు' కూడా దారుణంగా నిరాశపరిచింది. మొదటి షో నుంచే ఈ సినిమాకి నెగటివ్ టాక్ వచ్చింది. దాంతో వంద కోట్ల షేర్ క్లబ్ కి చేరువ కాలేకపోయింది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు 'ఓజీ'పైనే ఆశలు పెట్టుకున్నారు. (They Call Him OG)
చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గ భారీ సినిమా 'ఓజీ' రూపంలో వస్తోంది. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 'ఓజీ' నుంచి వస్తున్న ఒక్కో కంటెంట్ అంచనాలను పెంచేస్తోంది. రీసెంట్ గా విడుదలైన 'ఫైర్ స్ట్రామ్' సాంగ్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సెప్టెంబర్ 25న విడుదల కానున్న 'ఓజీ' మూవీ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రూ.100 కోట్లు కాదు.. ఏకంగా రూ.200 కోట్ల షేర్ సాధిస్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ట్రేడ్ వర్గాలు సైతం ఈ మూవీ రూ.500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశముందని అంచనా వేస్తున్నాయి.
![]() |
![]() |