![]() |
![]() |

కాజల్ అగర్వాల్, తమన్నా భాటియా, శ్రుతి హాసన్, సమంత.. ఈ నలుగురు ముద్దుగుమ్మలు కూడా ఒక దశలో తెలుగు చిత్ర సీమలో పోటాపోటీగా వరుస సినిమాలతో సందడి చేశారు. మంచి విజయాలను సొంతం చేసుకుని.. నిత్యం వార్తల్లో వ్యక్తులయ్యారు. అయితే, ఈ నలుగురిలోనూ `మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్` అనిపించుకుంది మాత్రం సామ్ నే. కాజల్, తమన్నా, శ్రుతి.. ఈ ముగ్గురు కూడా డెబ్యూ మూవీస్ తో ఫెయిల్యూర్స్ చూస్తే.. సమంత మాత్రం మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ చూసింది. కాజల్ లీడ్ రోల్ లో నటించిన `లక్ష్మీ కళ్యాణం` (2007).. తమన్నా మెయిన్ లీడ్ గా నటించిన `చాంద్ సా రోషన్ చెహ్రా` (హిందీ) (2005).. శ్రుతి డెబ్యూ మూవీ `లక్` (హిందీ) బాక్సాఫీస్ వద్ద బోల్తా పడితే.. సమంత మాత్రం మొదటి చిత్రం `ఏమాయ చేసావె`తోనే డ్రీమ్ డెబ్యూ ఇచ్చింది.
కట్ చేస్తే.. ఈ నలుగురు కూడా ఈ ఏడాది డిజిటల్ డెబ్యూ ఇచ్చారు. విశేషమేమిటంటే.. సిల్వర్ స్క్రీన్ పై వీరికి ఎలాంటి ఫలితాలు దక్కాయో.. ఓటీటీ వేదికల్లోనూ అవే రిజల్ట్స్ దక్కాయి. కాజల్ చేసిన ఫస్ట్ వెబ్ సిరీస్ `లైవ్ టెలికాస్ట్` (హాట్ స్టార్), తమన్నా డెబ్యూ సిరీస్ `లెవెన్త్ అవర్` (ఆహా), శ్రుతి డిజిటల్ డెబ్యూ `పిట్టకథలు` (ఆంథాలజీ - నెట్ ఫ్లిక్స్) (ఇందులో `ఎక్స్ లైఫ్` అనే సెగ్మంట్ లో శ్రుతి కనిపిస్తుంది) డిజప్పాయింట్ చేస్తే.. సామ్ డిజిటల్ ఎంట్రీ `ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2` (అమెజాన్) అమేజింగ్ రెస్పాన్స్ ని తెచ్చుకుంది. మొత్తమ్మీద.. అటు సిల్వర్ స్క్రీన్ పైనా, ఇటు డిజిటల్ వేదికల్లోనూ కాజల్, తమన్నా, శ్రుతి ఒకలా ఫలితాలు చూస్తే - సమంత మరోలా రిజల్ట్స్ అందుకుందన్నమాట!
![]() |
![]() |