![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న 75వ చిత్రం 'మాస్ జాతర'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకుడు. శ్రీలీల హీరోయిన్. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ గా విడుదలైన 'తు మేరా లవర్' ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ గా 'ఓలే ఓలే' విడుదలైంది. (Mass Jathara)
రవితేజ, శ్రీలీల కాంబినేషన్ లో వచ్చిన 'ధమాకా' మూవీ విజయంలో భీమ్స్ మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు 'మాస్ జాతర' కోసం కూడా ఎనర్జిటిక్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ముఖ్యంగా తాజాగా విడుదలైన 'ఓలే ఓలే' సాంగ్ మాస్ ని దృష్టిలో పెట్టుకొని చేసినట్టుగా ఉంది. ఇక భాస్కర్ యాదవ్ అందించిన లిరిక్స్ అయితే సర్ ప్రైజింగ్ గా ఉన్నాయి. "ఓలే ఓలే గుంట. నీ అయ్య కాడ ఉంటా. నీ అమ్మ కాడ తింటా. నీ ఒళ్ళోకొచ్చి పంటా. బుద్ధి లేదు.. జ్ఞానం లేదు.. సిగ్గు లేదు.. శరము లేదు.. మంచి లేదు.. మర్యాద లేదు" అంటూ ఊర నాటు భాషలో ఈ సాంగ్స్ లిరిక్స్ ఉన్నాయి. భీమ్స్ సిసిరోలియో, రోహిణి సోరట్ ఎంతో ఎనర్జిటిక్ గా ఈ పాటను ఆలపించారు. ఇక లిరికల్ వీడియోలో వింటేజ్ రవితేజ కనిపించాడు. శ్రీలీల కూడా తన ఎనర్జిటిక్ డ్యాన్స్ తో ఆకట్టుకుంది. మొత్తానికి థియేటర్లలో ఈ సాంగ్ ఒక ఊపేలా ఉంది.
కాగా, 'మాస్ జాతర' చిత్రం ఆగస్టు 27న విడుదల కానుంది. రవితేజ తన ల్యాండ్ మార్క్ మూవీతో మాస్ కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.
![]() |
![]() |