![]() |
![]() |

'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఓ కీలక షెడ్యూల్ పూర్తయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు డైరెక్టర్ హరీష్ శంకర్.
పవన్ కళ్యాణ్ తో దిగిన ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన హరీష్ శంకర్.. "మాటిస్తే నిలబెట్టుకోడం. మాట మీదే నిలబడ్డం. మీరు పక్కనుంటే.. కరెంటు పాకినట్టే" అని రాసుకొచ్చారు. అలాగే, పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో విజయవంతంగా 'ఉస్తాద్ భగత్ సింగ్' షెడ్యూల్ పూర్తయిందని తెలిపారు. అంతేకాదు, "ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అని హరీష్ సంతోషం వ్యక్తం చేశారు. హరీష్ శంకర్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాగా, ఇటీవల 'హరి హర వీరమల్లు'తో ప్రేక్షకులను పలకరించిన పవన్ కళ్యాణ్.. సెప్టెంబర్ 25న 'ఓజీ'తో థియేటర్లలో అడుగు పెట్టనున్నారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే అవకాశముంది.
.webp)
![]() |
![]() |