![]() |
![]() |
.webp)
తెలుగు సినిమా పరిశ్రమలో ఎవరి అండా దండా లేకుండా తన టాలెంట్ ని నమ్ముకొని పైకొచ్చిన నటుల్లో నిఖిల్ సిద్దార్ధ కూడా ఒకడు. కార్తికేయ 2 అనే మూవీ ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు ఆయన సినిమాల మీద సినిమాలు చేసుకుంటు ముందుకు దూసుకుపోతున్నాడు. తాజాగా ఆయన పర్సనల్ న్యూస్ ఒకటి వైరల్ గా మారింది.
నిఖిల్ కి 2020 లో పల్లవితో వివాహం జరిగింది. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇటీవలే ఆమె సీమంతం చాలా ఘనంగా జరిగింది. వాటికి సంబంధించిన పిక్స్ ని నిఖిల్ తన సోషల్ మీడియా ప్రొఫైల్ లో పోస్ట్ చేసాడు.నిఖిల్ అనుషాలు కలిసి దిగిన ఆ పిక్స్ చూసిన వాళ్ళందరు నిఖిల్ కి ఆయన వైఫ్ కి శుభాభినందనలు చెప్తున్నారు. కొంత మంది అభిమానులైతే పుట్టపోయేది పాప నా బాబు నా అని చర్చించుకుంటున్నారు.

ఇక నిఖిల్ ప్రస్తుతం తన ఎంటైర్ సినీ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన స్వయంభు అనే మూవీలో నటిస్తున్నాడు.చారిత్రక నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో నిఖిల్ యుద్ధ వీరుడుగా మెరవబోతున్నాడు.ఈ మూవీలోని తన క్యారక్టర్ కి సంబంధించిన యుద్ధ విన్యాసాలని కూడా నిఖిల్ ఇటీవలే నేర్చుకున్నాడు. స్వయంభూ కి ఠాగూర్ మధు నిర్మాతగా వ్యవహరిస్తుండగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేస్తుంది.ఇదే కాకుండా మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లు నిఖిల్ ఖాతాలో ఉన్నాయి. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.
![]() |
![]() |