![]() |
![]() |

భారతీయ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది అధ్బుతమైన దర్శకులు ఉన్నారు. కానీ అప్పటివరకు ప్రేక్షకులు చూడని సరికొత్త కథ,కథనాలతో పాటు విజువల్ ట్రీట్ ని సిల్వర్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసే దర్శకులు అతి కొద్దీ మంది మాత్రమే ఉన్నారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉండే దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి. లేటెస్ట్ గా ఆయన టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారాడు.

సంజయ్ లీలా బన్సాలి నుంచి వస్తున్న తాజా మూవీ హీరామండి. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ని కొంచంసేపటి క్రితమే మేకర్స్ విడుదల చేసారు. లవ్, పవర్, ఫ్రీడమ్ అనే మూడు సూపర్ వర్డ్స్ ని కోట్ చేస్తు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఒక లెవల్లో ఉంది. అలాగే విజువల్స్ ని చూస్తుంటే రెండు కళ్ళు చాల్లేదు. సుమారు 50 సెకన్లు ఉన్న వీడియోనే సూపర్ గా ఉందంటే ఇంక మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్ధం అవుతుంది. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, షర్మిన్ సెగల్ మరియు సంజీదా షేక్ లు ఫస్ట్ లుక్ లో మెరిసి సినిమా మీద అంచనాలు పెంచారు. కాకపోతే హీరామండి డైరెక్ట్ గా ఓటిటి వేదికగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. డైమండ్ బజార్ అనే క్యాప్షన్ హీరామండి మీద ఆడియెన్స్ లో ఎక్సపెక్టేషన్స్ ని పెంచింది.
భారత దేశానికి స్వాతంత్య్రం రాకముందు 1940 వ ప్రాంతంలో డైమండ్ బజార్ గా పిలవబడే హీరామండి ఏరియాలో ఒక వేశ్యా గృహం ఉంటుంది. ఆ వేశ్యా గృహానికి స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన అంశాలని జోడిస్తు సంజయ్ లీలా హీరామండి ని తెరకెక్కించాడు. సంజయ్ లీలా నుంచి గతంలో దేవదాస్, గుజారిష్, బాజీరావు మస్తానీ, పద్మావత్, గంగూబాయి కైత్ వాడి లాంటి సూపర్ చిత్రాలు వచ్చాయి. బాజీరావు మస్తానీ, పద్మావత్ చిత్రాల కథల విషయంలో ఆయన మీద చాలా విమర్శలు వచ్చాయి.
![]() |
![]() |