![]() |
![]() |

మూవీ : పరంపోరుల్
నటీనటులు: శరత్ కుమార్, అమితాష్, కష్మీరా, తదితరులు
ఎడిటింగ్: నగూరన్ రామచంద్రన్
సినిమాటోగ్రఫీ: ఎస్.పాండికుమార్
మ్యూజిక్: యువన్ శంకర్ రాజా
నిర్మాతలు : మనోజ్, గిరీష్
రచన, దర్శకత్వం: సి. అరవింద్ రాజ్
ఓటీటీ : ఈటీవి విన్
పోర్ తోజిల్ సినిమాలో శరత్ కుమార్ ని చూసిన తెలుగు అభిమానులు చాలా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు మరో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'పరంపోరుల్' తో మన ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా కథేంటో ఓసారి చూసేద్దాం...
కథ:-
తమిళనాడులోని ఓ ఊరిలో విశ్వనాథం అనే రైతుకి ఓ దేవత విగ్రహం లభిస్తుంది. దాంతో ఆ ఊళ్ళో కాస్త పలుకబడి ఉన్న వ్యక్తితో ఆ విషయాన్ని చెప్పగా అతనొక రౌడీని తీసుకొస్తాడు. ఆ విగ్రహాన్ని చూసిన రౌడీ ఆ విశ్వనాథంని చంపేసి తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఆ విగ్రహం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళింది. ఆది(అమితాష్) అనే ఒక యువకుడు అర్థరాత్రి పోలీసు అధికారి మైత్రేయన్ అలియాస్ మైత్రి( శరత్ కుమార్) వాళ్ళింట్లో దొంగతనానికి వస్తాడు. అది పసిగట్టిన మైత్రి వాడిని వెంబడించి పట్టుకుంటాడు. ఆ తర్వాత ఆదిపై స్టేషన్ లో ఉన్న కేసులన్నింటిని వేస్తానని, తనతో కలిసి భాగస్వామిగా చేరమని బెదిరిస్తాడు. మరి ఆది, మైత్రి కలిసారా? అక్రమ విగ్రహాల రవాణాలో ఆది పాత్రేంటి? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:-
తమిళనాడులోని ఓ ప్రాంతంలో రెగ్యులర్ గా ఓ ముఠా ఇలా అక్రమ విగ్రహ రవాణా చేస్తుందంటు వారికి సపోర్ట్ గా పోలీసులు కూడా సహకరిస్తున్నారంటు చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగేలా మలిచారు డైరెక్టర్. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ని ఇంటెన్స్ స్క్రీన్ ప్లేతో ప్రెజెంట్ చేసి ప్రేక్షకుడికి ఆసక్తిని రేకెత్తించడంలో డైరెక్టర్ సి. అరవింద్ రాజ్ సక్సెస్ అయ్యాడు.
పోర్ తోజిల్ సినిమాలో శరత్ కుమార్ ని చూసినట్లుగా అనిపిస్తుంది. సీరియస్ గా సాగే స్మగ్లింగ్ ని పోలీసు వ్యవస్థలో ఉండే ఓ క్రమశిక్షణ గల అధికారి చేయడం ఎవరూ ఊహించని ట్విస్ట్ గా సాగుతుంది. మూవీ మొదట స్లోగా మొదలయిన వెళ్ళే కొద్దీ వేగం పుంజుకుంది. అడల్ట్ సీన్స్ ఏం లేకపోగా.. ఇంటెన్స్ డ్రామని క్రియేట్ చేశారు మేకర్స్. అంతకంతకు మారే పరిస్తితులని చక్కని స్క్రీన్ ప్లేతో ముందుకు తీసుకెళ్ళారు. అయితే చివరి పది నిమిషాల్లో వచ్చే ట్విస్ట్ ఎవరి ఊహకి అందదు.
విగ్రహాలని విలన్స్ కి అమ్మే సీన్ లో గ్రిస్పింగ్ ఉంటుంది. ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని సీన్లని సెకండాఫ్ లో లింక్ చేయడం బాగుంటుంది. అయితే ఫస్టాఫ్ లో వచ్చే ప్రతీ సీన్ ని చూస్తేనే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి కనెక్ట్ అవుతారు. ఎక్కడ అడల్ట్ సీన్స్ లేవు. మధ్యమధ్యలో వచ్చే రెండు మూడు పాటలని స్కిప్ చేస్తే బాగుంటుంది.
నిఖిల్ నటించిన 'స్వామిరారా' సినిమాలో లాగా విగ్రహం చుట్టూ కథ తిరిగిన ఇక్కడ కామెడీ ఉండదు. చివరివరకు సీరియస్ ఇంటెన్స్ తో సాగుతుంది. యువన్ శంకర్ రాజా అందించిన బిజిఎమ్ ప్రతీ సీన్ ని ఎలవేట్ చేసింది. ఎస్.పాండికుమార్ సినిమాటోగ్రఫీ మూవీకి ప్రధాన బలంగా నిలిచింది. నగూరన్ రామచంద్రన్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:-
మైత్రి గా శరత్ కుమార్ ఒదిగిపోయాడు. ఆదిగా అమితాష్ చక్కగా నటించాడు. కష్మీరా తనకున్నంతలో బాగా నటించింది. ఇక మిగిలిన వారు వారి పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
ఫైనల్‌గా:-
అక్రమ విగ్రహాల రవాణాతో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగే ఈ సినిమాని ఓసారి చూసేయొచ్చు.
రేటింగ్ : 3 / 5
✍️. దాసరి మల్లేశ్
![]() |
![]() |