![]() |
![]() |

లావణ్య త్రిపాఠి అండ్ నిహారిక ఇద్దరు వదిన మరదళ్ళుగా కంటే ముందు వెండి తెర మీద తమ అధ్బుతమైన నటనతో హీరోయిన్స్ గా మెరిశారు. తాజాగా లావణ్య మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.నిహారిక చేతిలో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ తను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటు తన పర్సనల్ విషయాలని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా నిహారిక పోస్ట్ చేసిన ఒక వీడియో సంచలనం సృష్టిస్తుంది.
నిహారిక, లావణ్య త్రిపాఠిలు కలిసి తోబ తోబ తోడు ఉంది దిల్ రూబా అనే సాంగ్ కి చిందులేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలోని ఆ పాటకి ఇద్దరు ఎంతో హుషారుగా స్టెప్ లు వేశారు. తాజాగా నిహారిక ఆ డాన్స్ వీడియోని తన ఇనిస్టా లో షేర్ చేసింది. అంతే నిమిషాల వ్యవధిలో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆలాగే ఆ వీడియో ట్రెండింగ్ లో కూడా ఉంది.లైక్స్ అండ్ కామెంట్స్ కూడా విపరీతంగా వస్తున్నాయి.
ఇటీవల వచ్చిన సంక్రాంతి ఫెస్టివల్ ని మెగా కుటుంబ సభ్యులందరు బెంగళూరు లో చాలా ఘనంగా జరుపుకున్నారు.ఆ వేడుకలోనే లావణ్య త్రిపాఠి, నిహారిక లు కలిసి పవన్ కళ్యాణ్ పాటకి చిందులేశారు.
![]() |
![]() |