![]() |
![]() |

లేడీ సూపర్ స్టార్ నయన తార ప్రధాన పాత్రలో గత నెల డిసెంబర్ 1 న వచ్చిన మూవీ అన్నపూరణి. బ్రాహ్మణుల మనోభావాల్ని అన్నపూరణి దెబ్బతీసిందని గత కొన్ని రోజుల నుంచి తమిళనాడు వ్యాప్తంగా నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఈ విషయంపై నయనతార స్పందించడం ప్రాధాన్యతని సంతరించుకుంది.
ఒక వ్యక్తి కి దృఢ సంకల్పం ఉంటే తను అనుకున్నది సాధించవచ్చనే ఒక మంచి ఆలోచనని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో అన్నపూరణి ని తెరకెక్కించామని నయనతార చెప్పింది. అంతే గాని ఎవరి మనోభావాల్ని గాయపరచటానికి సినిమాని నిర్మించలేదని కూడా ఆమె వెల్లడి చేసింది. తమకి తెలియకుండానే కొందరి మనసుల్ని గాయపరిచామనే విషయం చాలా లేటుగా అర్ధం అయ్యిందని అందుకు క్షమాపణలు కోరుతున్నానని ఒక సుదీర్ఘమైన నోట్ కూడా రాసింది. అలాగే తను అన్ని మతాల ప్రార్ధన స్థలాలని సందర్శిస్తానని ఉద్దేశ పూర్వకంగా ఏ మతాన్ని అగౌరవ పరచాలనే ఆలోచన తనకి లేదని కూడా వివరణ చెప్పింది. కాకపోతే సెన్సార్ బోర్డు క్లియర్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత కూడా సినిమా వివాదాస్పదమవడం బాధగా ఉందని మాత్రం ఆమె చెప్పింది. వాణిజ్య ప్రయోజనాల కోసమే అన్నపూరణి నిర్మించలేదని కూడా ఆమె చెప్పింది.

ఒక బ్రాహ్మణ యువతీ జాతీయ స్థాయిలో నెంబర్ వన్ చెఫ్ గా నిలవాలనే ఉద్దేశంలో భాగంగా నాన్ వెజ్ ని వండుతుంది. ఆ సమయంలో నమాజ్ కూడా చేస్తుంది. వీటిపైనే బ్రాహ్మణ సంఘాలు నిరసన వ్యక్తం చేసాయి. ఫలితంగా అన్నపూరణి ఓటిటి హక్కులని పొందిన నెట్ ఫ్లిక్స్ సంస్థ తమ సైట్ నుంచి కొన్ని రోజుల క్రితమే అన్నపూరణి ని తొలగించింది. ఆ మూవీని నిర్మించిన జీ యాజమాన్యం కూడా గతంలో నిరసనకారులని క్షమాపణలు కోరింది. ఇప్పుడు నయనతార కూడా క్షమాపణలు కోరింది. పైగా జై శ్రీరామ్ అంటూ ఆమె క్షమాపణలు కోరడం గమనార్హం
![]() |
![]() |