![]() |
![]() |

నటుడుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ పై హీరోగా ఎదిగి తనకి మాత్రమే సాధ్యమయ్యే డిఫరెంట్ కామెడీ తో సిల్వర్ స్క్రీన్ మీద నవ్వులు పూయించిన హీరో శివాజీ. బిగ్ బాస్ షో తో ఒక్కసారిగా పాపులర్ అయ్యి రెండు తెలుగు రాష్టాల ప్రజల చేత శివన్న అని పిలిపించుకుంటున్నాడు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాక్ అఫ్ ది తెలుగు స్టేట్స్ గా మారాయి.
శివాజీ చేతుల మీదుగా మార్కెట్ మహాలక్ష్మి అనే కొత్త సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు మనలో విషయం ఉండాలే గాని కళామతల్లి ప్రతి ఒక్కర్ని ఆదరిస్తుంది. కాకపోతే మనం త్రికరణ శుద్ధిగా పని చేస్తు ఉండాలని చెప్పాడు. అంతే కాకుండా తనకి 27 ఏళ్ళ వయసులో యాక్టింగ్ ని మొదలు పెడితే 50 ఏళ్ళ వయసులో గుర్తింపు వచ్చిందని కూడా ఆయన చెప్పాడు. అలాగే ఇండస్ట్రీ లో ఎదగాలంటే క్యారక్టర్,హార్డ్ వర్క్, ఓపిక ముఖ్యం అని చెప్పడంతో పాటు నిజాయితీగా మన పని మనం చేసుకుంటూ వెళ్తుంటే సక్సెస్ దానంతట అదే వస్తుందని కూడా శివాజీ చెప్పాడు.

అలాగే మార్కెట్ మహాలక్ష్మి టీం కి తన శుభాకాంక్షలు తెలియ చేస్తు సినిమా ఘన విజయం సాధించాలని కూడా ఆయన కోరుకున్నారు.కేరింత ఫేమ్ పార్వతీశం హీరోగా చేస్తున్న మార్కెట్ మహాలక్ష్మిలో ప్రణికాన్విక హీరోయిన్ గా చేస్తుండగా నూతన దర్శకుడు విఎస్ ముకేశ్ దర్శకత్వాన్ని వహిస్తున్నాడు. బి 2 పి స్టూడియోస్ పతాకంపై అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
![]() |
![]() |