![]() |
![]() |
నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది భలే భలే మగాడివోయ్. చిన్న సినిమాల్లో ... భలే భలే వసూళ్లని సాధించి అందరినీ నివ్వెరపరిచింది. రూపాయి పెట్టుబడి పెడితే పది రూపాయల లాభం సంపాదించి పెట్టిందీ సినిమా. అందుకే.. ఈ టైటిల్‌కున్న బ్రాండ్‌ని వాడుకోదలచుకొన్నారు నాని - మారుతి. ఈ సినిమాకి సీక్వెల్ తీసుకురాబోతున్నారు. ఈ విషయాన్ని మారుతి కూడా దృవీకరించాడు. నానితో మరో సినిమా ప్లాన్ చేస్తున్నానని, భలే భలే మగాడివోయ్‌కి సీక్వెల్ అవ్వొచ్చని హింట్ ఇచ్చేశాడు. భలే భలే మగాడివోయ్‌లో మతిమరపు యువకుడిగా కనిపించి వినోదం పండించాడు నాని. ఆ పాత్రని మాత్రమే హైలెట్ చేస్తూ.. ఈ సినిమా సాగుతుందట. నాని పాత్ర కంటిన్యూ అవుతూ, కొత్త పాత్రలు వస్తాయని తెలుస్తోంది. బాబు బంగారంతో ఓ ఫ్లాప్ చవిచూశాడు మారుతి. తాను మళ్లీ ఫామ్‌లోకి వచ్చి, పెద్ద హీరోల్ని ఆకట్టుకోవాలంటే.. కచ్చితంగా హిట్టు పడాల్సిందే. వరుస విజయాలతో దూకుడుమీదున్న నానిని నమ్ముకోవడం మినహా మారుతికి మరో మార్గం లేదు. అందుకే ఈ సీక్వెల్‌కి ప్లాన్ చేసినట్టు వినికిడి.
![]() |
![]() |