Home

»

Latest News

కొరటాలతో 151

Sep 3, 2016 4:24PM

ప్రజంట్ టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్‌లో ఒకరిగా మారిపోయారు కొరటాల శివ. దమ్మున్న కథలతో పాటు హీరోలను స్టైలిష్‌గా చూపడంలో కొరటాల దిట్ట. అందుకే కుర్ర హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు శివ ఫేవరేట్‌గా మారిపోయారు. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల నెక్ట్స్ ఎవరితో సినిమా చేయబోతున్నారా..? అని ఇండస్ట్రీతో పాటు అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో కొరటాలకు బంపర్ ఆఫర్ తగిలింది. అదేంటంటే మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్.  తన 150వ సినిమా ఇంకా సెట్స్‌పై ఉండగానే 151వ చిత్రం కోసం అప్పుడే కసరత్తు రెడీ చేస్తున్నారట చిరు. ఈ సినిమాకు దర్శకుడిగా శివ అయితే బాగుణ్ణు అని మెగాస్టార్ భావిస్తున్నారట. ఈ విషయం కొరటాల వరకూ వెళ్లిందని, మంచి కథ తయారు చేయడానికి సిద్ధమవుతున్నాడని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే మెగాస్టార్ 151వ చిత్రానికి కొరటాల దర్శకత్వం వహించే అవకాశముందని ఫిల్మ్‌నగర్‌ టాక్. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com