.jpg)
సినిమాలు లేకపోయినా ట్విట్స్ ద్వారా ఎప్పుడూ లైమ్ లైట్‌లో ఉంటారు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. అయితే గత కొంతకాలంగా హైదరాబాద్‌ను వదిలి ముంబైలోనే ఉంటున్నాడు. ఇటీవల కాలంలో ట్వీట్స్‌తో హల్‌చల్ చేసింది కూడా లేదు. కానీ తిరిగి కొద్ది రోజులుగా తన మార్క్ కామెంట్లతో సోషల్ మీడియాను హోరేత్తిస్తున్నారు. నిన్న పవన్, జూనియర్ ఎన్టీఆర్‌లపై ప్రశంసల వర్షం కురిపిస్తూ వరుస ట్వీట్లు చేశాడు. మళ్లీ వర్మకు టాలీవుడ్ ఎందుకు గుర్తోచ్చిందా అని ఆలోచిస్తే అసలు విషయం తెలిసింది. బెజవాడ రౌడీయిజం నేపధ్యంలో వర్మ తెరకెక్కిస్తున్న సినిమా వంగవీటి..ఈ మూవీని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న రిలీజ్ చేస్తున్నట్లు వర్మ ప్రకటించాడు. రిలీజ్ టైం దగ్గరపడతుండటంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకే వర్మ ట్వీట్లలోకి దిగినట్లున్నాడు.
.jpg)
ఈ విషయం పక్కనబెడితే వంగవీటి పూర్తిగా శాంతియుత సినిమా అని ట్వీట్ చేశాడు రామూ. అసలు ఇది నమ్మదగ్గ విషయమేనా..వర్మ సినిమాల్లో హింసకూ..రోమాన్స్‌కే పెద్ద పీట అన్న విషయం చిన్న పిల్లలను అడిగినా చెబుతారు. అదంతా ఒక ఎత్తైతే బెజవాడ రౌడీయిజం అంటే రక్తచరిత్రే. రెండు వర్గాల మధ్య జరిగిన ఆధిపత్య పోరు. పైగా సినిమా ఫస్ట్‌లుక్ సమయంలో మహాభారతంలో కన్నా బెజవాడలోనే ఎక్కువ హింస జరిగిందంటూ స్వయంగా వర్మే అన్నాడు. మరి ఇప్పుడేమో వంగవీటి శాంతియుత సినిమా అని ట్వీట్ చేయడం వెనుక రామూ ఉద్దేశ్యం ఏంటి..? ఏముంది పబ్లిసిటీ..!




.jpg)

