![]() |
![]() |

వెండి తెరపై పూరి జగన్నాథ్ మాయాజాలం కనిపించి చాలాకాలం అయ్యింది. పూరి తరహా టేకింగ్, పూరి శైలిలో సాగే డైలాగులు.. పూరి హీరోయిజం ఇవన్నీమిస్ అయిపోతున్నాయన్న ఫీలింగ్ కలుగుతోంది. అందుకే పూరిని పెద్ద హీరోలు నమ్మడం లేదు. అవకాశం ఇస్తామని చెప్పి, చివరికి హ్యాండి ఇస్తున్నారు. ఈ దశలో తనని తాను నిరూపించుకోవాల్సిన తరుణం వచ్చింది. ఆ ప్రయత్నంలో చేస్తున్న సినిమా... `ఇజం`. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇజం టైటిల్‌తోనే పూరి... సగం ఆసక్తిని క్రియేట్ చేశాడు. ఇప్పుడు టీజర్ కూడా బయటకు వచ్చింది. టీజర్‌లో కల్యాణ్ రామ్ కండలు చూపించి ఆ ఆసక్తిని పెంచాడు. టేకింగ్ పరంగా... ఈ సినిమా వేరే లెవిల్లో ఉన్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది. యాక్షన్ సీక్వెన్స్‌లతో టీజర్ నింపేశాడు పూరి. అయితే పూరి సినిమాల్లో, టీజర్లలో కనిపించి, వినిపించి, కవ్వించే పంచ్ డైలాగ్ మాత్రం ఈ టీజర్లో మిస్సయ్యింది. అదొక్కటి మినహాయిస్తే.. పూరి మార్క్ స్పష్టంగానే కనిపిస్తోంది. దసరాకి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఇజం...లో పూరి చెప్పే నిజం ఏంటో తెలియాలంటే అప్పటి వరకూ ఆగాలి. ప్రస్తుతానికి టీజర్‌కి మాత్రం ఫస్ట్ క్లాస్ మార్కులు పడిపోయాయి.
![]() |
![]() |