![]() |
![]() |

స్మాల్ స్క్రీన్ మీద బిగ్ బాస్ షో ఎంత పాపులర్ అయ్యిందో ఆ షో లో పాల్గొన్నకంటెస్ట్ లు కూడా అంతే పాపులర్ అయ్యారు. ఇప్పటి వరకు 7 సీజన్లను కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ ఎంతో మందిని సెలబ్రిటీ లుగా మార్చడమే కాకుండా వాళ్ళకి సరికొత్త జీవితాన్ని కూడా ఇచ్చింది. కానీ ఒక్క విషయంలో మాత్రం తన కంటెస్ట్ లకి అదృష్టాన్ని దక్కించలేకపోతుంది.
బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్ట్ లందరు తెలుగు ప్రజలకి చాలా దగ్గరయ్యారు. అలా వచ్చిన ఇమేజ్ తో తమ అదృష్టాన్ని పరిష్కారించుకోవాలని చాలా మంది సినిమాల్లో నటించారు. సన్నీ, సోహైల్ లాంటి వాళ్ళు అయితే హీరోలుగా కూడా చేసారు. కానీ ఎవరు సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఈ విషయాన్నంతా ఎందుకు చెప్పుకోవలసి వస్తుందంటే బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ తాజాగా మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. అతి త్వరలోనే ఆ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సిరీస్ అయినా తమ అభిమాన నటుడు అభిజిత్ కి మరింత మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నారు. అభిజిత్ గతంలో ఒక సినిమా తో పాటు పెళ్లిగోల అనే వెబ్ సిరీస్ లో నటించాడు.అలాగే బిగ్ బాస్ లో చేసిన వాళ్ల కెరీర్ అంత వేగంగా ముందుకు వెళ్లదనే అపవాదుని అభిజిత్ చెరిపేస్తాడేమో చూడాలి.

మెగా కోడలు లావణ్య త్రిపాఠీ ప్రధాన పాత్రలో నటించిన మిస్ పర్ఫెక్ట్ కి సంబంధించిన ప్రోమోని ఇటీవలే రిలీస్ అయ్యింది. డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్న మిస్ పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ ని మేకర్స్ అతి త్వరలోనే ప్రకటిస్తారు.
![]() |
![]() |