![]() |
![]() |

ఇప్పుడు నాగార్జున ఫ్యాన్స్ ని ఒక పట్టాన ఆపటం ఎవరి వల్ల కావటం లేదు. ఎన్నాళ్లకెన్నాళ్లకు మా నాగ్ మాస్ నట విశ్వరూపాన్ని కళ్లారా చూస్తున్నామనే ఆనందంలో వాళ్లంతా ఉన్నారు. ఇటీవలే వచ్చిన నా సామి రంగ ట్రైలర్ తో మంచి జోష్ లో ఉన్న వాళ్లకి ఇప్పుడు మరింత జోష్ ని తెచ్చేలా అదిరిపోయే సాంగ్ ఒకటి రిలీజ్ అయ్యింది.
నా సామి రంగ నుంచి తాజాగా దుమ్ము దుకాణం అనే సాంగ్ రిలీజ్ అయింది. ఇలా రిలీజ్ అయ్యిందో లేదో అప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలలో మారుమోగిపోతుంది.అలాగే ఇక నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పెళ్లి జరిగినా కూడా దుమ్ము దుకాణం మోతమోగిపోవడం ఖాయం. ఈ సాంగ్ కి ఉన్న స్పెషల్ ఏంటంటే సాంగ్ మొత్తం ఎంత స్పీడ్ గా ఉన్నా కూడా లిరిక్స్ మొత్తం పసిపిల్లల నుంచి ముసలి వల్ల దాకా అందరు పాడుకునేలా క్యాచీగా ఉన్నాయి. ఆస్కార్ విన్నర్స్ అయిన చంద్రబోస్ సాహిత్యాన్ని అందించగా కీరవాణి ట్యూన్ ని అందించారు.

జనవరి14 న రెండు తెలుగు రాష్ట్రాల్లో తన సత్తా చాటడానికి వస్తున్న నాగ్ నా సామి రంగ పక్కా హిట్ అవుతుందనే నమ్మకంతో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఉన్నారు. నాగ్ సరసన ఆషికా రంగనాధ్ హీరోయిన్ గా చేస్తుండగా, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, రుక్సార్ థ్రిల్లన్ తదితరులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న నా సామి రంగ కి ప్రముఖ కొరియో గ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడు.
![]() |
![]() |