![]() |
![]() |

తమిళ నయా సూపర్ స్టార్ ధనుష్(Dhanush)హీరోగా వస్తున్న మోస్ట్ ప్రెస్టిజియస్ట్ మూవీ కెప్టెన్ మిల్లర్ (Captain miller)ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ తో సినిమా మీద అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ధనుష్ అభిమానులైతే మూవీ రిలీజ్ అయ్యే జనవరి 12 కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ రిలీజ్ కి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
కెప్టెన్ మిల్లర్ ఓవర్సీస్ హక్కులని ప్రముఖ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. ధనుష్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ అయ్యేలా లైకా సంస్థ ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే ఓవర్ సీస్ లో చాలా చోట్ల అడ్వాన్స్ బుకింగ్ ఫుల్ క్రౌడ్ లో ఉంది. ఆల్రెడీ తమినాడులో ధనుష్ అభిమానుల హంగామా స్టార్ట్ అయ్యింది.

అరుణ్ మతేశ్వరన్(Arun Matheswaran)దర్శకత్వంలో వస్తున్న కెప్టెన్ మిల్లర్ లో ధనుష్ సరసన ప్రియాంక మోహన్ (priyanaka mohan)నటిస్తుండగా సత్య జ్యోతి ఫిలిమ్స్ సంస్థ ఖర్చుకి ఎక్కడ రాజీపడకుండా నిర్మించింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతాన్నిఅందించగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్(shiva rajkumar)సందీప్ కిషన్ లు కీలక పాత్రల్లో నటించారు. తెలుగు ప్రేక్షకులని మాత్రం కెప్టెన్ ఒక వారం రోజుల తర్వాత పలకరిస్తాడు.
![]() |
![]() |