![]() |
![]() |

ఇటీవలే ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్ మూవీతో వచ్చి ప్రేక్షకులని తన నటనతో మెప్పించిన హీరో నితిన్ (nithin)ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సరైన విజయాన్ని ఆశించకపోయినా కూడా నితిన్ నటనకి మాత్రం ప్రేక్షకుల నుంచి విమర్శకుల నుంచి మంచి పేరే వచ్చింది. ప్రస్తుతం నితిన్ తమ్ముడు( thammudu)అనే మూవీని చేస్తున్నాడు. తాజాగా ఆ మూవీ షూటింగ్ లో జరిగిన ఒక సంఘటన నితిన్ అభిమానులని కలవరపాటుకి గురి చేసింది.
తమ్ముడు సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి అడవుల్లో జరుగుతుంది. కథ కి అత్యంత కీలకమైన ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ని నితిన్ మీద చిత్ర యూనిట్ చిత్రీకరిస్తుంది. ఈ సమయంలోనే నితిన్ చేతికి గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే చిత్ర యూనిట్ షూటింగ్ ని నిలిపివేసింది. అనంతరం నితిన్ ని పరీక్షించిన డాక్టర్ మూడు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. ఈ వార్తతో నితిన్ ఫాన్స్ షాక్ కి గురయ్యారు
తమ్ముడు సినిమాకి దిల్ రాజు(dil raju) నిర్మాతగా వ్యవహరిస్తుండగా వకీల్ సాబ్ డైరెక్టర్ శ్రీ రామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నాడు. అక్కా,తమ్ముడు సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్ ఒక్కప్పటి పవన్ కళ్యాణ్(pawan kalyan) సూపర్ డూపర్ హిట్ మూవీ తమ్ముడు దే కావడం గమనార్హం. అలాగే నితిన్ పవన్ కి వీరాభిమాని అనే విషయం అందరికి తెలిసిందే.
![]() |
![]() |