![]() |
![]() |

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనాథ్ మాగంటి (Srinath Maganti) ప్రధాన పాత్రలో నటించిన రూరల్ కామెడీ ఎంటర్టైనర్ ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ (Mension House Mallesh). మార్చి 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయిన ఈ సినిమా, ఓటీటీలో ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందో చూడాలి.
ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు:
ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 22 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఎటువంటి హడావుడిగా లేకుండానే ఓటీటీలో అడుగుపెట్టడం విశేషం. అంతేకాకుండా, ఈ సినిమా ఏప్రిల్ 27 నుంచి సన్ నెక్స్ట్ (Sun NXT) ఓటీటీలో కూడా అందుబాటులోకి రానుంది.

సినిమా విశేషాలు:
గ్రామీణ నేపథ్యం, అక్కడి మనుషులు, వారి మధ్య జరిగే ఫన్నీ సంఘటనలతో ఈ చిత్రం రూపొందింది. అయితే ఇది అడల్ట్ కామెడీ నేపథ్యంలో సాగుతుంది. హీరోకి కొత్తగా పెళ్లవడం, అతనికి శారీరిక సమస్య ఉండటం వంటి సన్నివేశాలు ఇందులో ఉంటాయి.
శ్రీనాథ్ మగాంటి తన సహజ సిద్ధమైన నటనతో గ్రామీణ యువకుడి పాత్రలో ఒదిగిపోయారు. మాస్, కామెడీ ఎలిమెంట్స్‌తో సాగే ఈ కథలో పల్లెటూరి వాతావరణాన్ని చక్కగా ప్రతిబింబించారు.
ప్రస్తుతం ఓటీటీలో చిన్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా రూరల్ కామెడీలకు ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.
![]() |
![]() |