![]() |
![]() |

అసలు మీకేమైనా అర్ధమవుతుందా.. ఏంటి స్వామి ఈ వరుస విజయాలు.. గ్యాప్ కూడా ఇవ్వకుండా వరుస విజయాల్ని అందుకుంటున్నారు. ఆ సీక్రెట్ చెప్పి పుణ్యం కట్టుకోండి.. ఇప్పుడు ఈ మాటల్ని తమ పనుల్లో బిజీగా ఉంటూనే ఒక మూవీ సాధిస్తున్న కలెక్షన్స్ చూసి ఆల్ ఇండియా సినీ మేకర్స్ అనుకుంటున్నారు. అనుకోరు అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా సినిమా గురించే మాట్లాడుకోవడమే మేకర్స్ పని. కింద మనం చెప్పుకునే న్యూస్ విన్నాక మీరు కూడా నిజమే భయ్యో అంటారు. మరి ఆ న్యూస్ చూసేద్దాం
మలయాళ బొమ్మ వాలా 2(Wala 2)రెండు వందల కోట్లకి పైగా వసూళ్లు సాధించి రికార్డులు తిరగరాస్తోంది. తెలుగులో కూడా రేపు రిలీజ్ కావడంతో కలెక్షన్స్ స్థాయి మరింతగా పెంచుకోనుంది. పాన్ ఇండియా వ్యాప్తంగా ఈ అరుదైన ఘట్టాన్ని చూస్తూ ఉన్న ప్రేక్షకుల చూపు మరో అరుదైన ఘట్టాన్ని వీక్షిస్తున్నాయి. భరతనాట్యం 2: మోహినియాట్టం'(Bharathanatyam 2 Mohiniyattam) ఏప్రిల్ 10 న రిలీజైన ఈ మలయాళీ బొమ్మ పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 21.50 కోట్లకి పైగా వసూళ్లను సాధించి 'క్లీన్ హిట్' గా నిలిచింది. ఇందులో ఏముంది సినిమా బాగుంటే వస్తాయి కదా అనుకోవచ్చు. కానీ వాలా 2 తన పౌరుషాన్ని చూపిస్తున్న వేళ పది రోజుల్లోనే రికార్డు కలెక్షన్స్ వైపు దూసుకెళ్తుండటం సామాన్యమైన విషయం కాదు. పైగా నటీనటులు కూడా పెద్దగా పేరున్న వాళ్ళు కాదు.
Also read: Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ పై అభిషేక్ బచ్చన్ కీలక వ్యాఖ్యలు.. విడిపోతున్నారనే రూమర్స్ నిజమవుతాయా!
2024లో వచ్చిన 'భరతనాట్యం'కి సీక్వెల్ గా తెరకెక్కగా మొదటి భాగం కుటుంబ రహస్యాలను కాపాడుకునే యువకుడి కథగా సాగితే, ఈ రెండో భాగం మరింత ఆసక్తికరంగా 'డార్క్ కామెడీ' జోనర్‌లో సాగుతుంది. శశి, మరియు అతని కుటుంబం తమ తండ్రి రెండో భార్య కుటుంబాన్ని కొత్త ఇంటికి షిఫ్ట్ చేసే క్రమంలో ఎదుర్కొనే అనూహ్య పరిణామాలు, నేరాలు మరియు హాస్యం చుట్టూ కథ తిరుగుతుంది. ప్రతిభసాయిజు కురుప్ తన సహజసిద్ధమైన నటనతో మెప్పించగా, సీనియర్ నటుడు సూరజ్ వెంజరమూడు తనదైన కామెడీ టైమింగ్‌తో మూవీని మరో స్థాయికి తీసుకెళ్లాడు. కృష్ణదాస్ మురళి(Krishna das Murali)దర్శకత్వ ప్రతిభ, ముఖ్యంగా స్క్రీన్ ప్లే ప్రధాన బలంగా నిలిచాయి. కంటెంట్ బాగున్న సినిమాలకి ఇలాంటి మహర్దశే పడుతుంది. కథ , కథనంకి రికమండేషన్ కాండిట్స్ ని ఎంచుకోకపోవడం కూడా మలయాళీ బొమ్మ గొప్పతనం.

![]() |
![]() |