Home  »  News  »  Nani: మీ కోసం ఈ సమ్మర్ కే మళ్ళీ వస్తున్నా.. డేట్ ఇదే 

Updated : Apr 23, 2026

 

వైవిధ్యమైన సినిమాలని అభిమానులు, ప్రేక్షకులకి అందించడానికి సెల్యులాయిడ్ నే స్వయంగా కొంత మంది హీరోలని ఎంచుకొని వాళ్ల దారిని సినీ రహదారిగా మారుస్తుంది. అలాంటి ఒక హీరో నాచురల్ స్టార్ నాని(Nani). ప్రస్తుతం పాన్ ఇండియాని షేక్ చేయడానికి 'ది ప్యారడైజ్'(The Paradise)ని రెడీ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన  అప్ డేట్స్ ని అభిమానులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా  చూసుకుంటూనే వాళ్ళు వెళ్లే దారిలో ఉన్న థియేటర్స్ వైపు ఒక లుక్ వేస్తు ప్యారడైజ్ రిలీజ్ రోజు థియేటర్స్ లోకి పరుగెత్తుకుంటూ వెళ్లడాన్ని తలుచుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు అంతకంటే ముందు థియేటర్స్ కి వెళ్లాల్సిన పరిస్థితి.

నాని తన అభిమానులు, ప్రేమికులు, మూవీ లవర్స్, ప్రేక్షుకుల కోసం 'నిన్ను కోరి'  రీ రిలీజ్ చేస్తున్నాడు. వేసవి వేడి తాలూకు సెగని కనిపించకుండా చేయడానికి  మే 8 న  ల్యాండ్ అవుతున్నాడు. దీంతో థియేటర్స్ లో మరో సారి నాని చరిష్మా కొనసాగబోతుంది. ప్రేమికులకి, ప్రేమలో విడిపోయి వేరే పెళ్లిళ్లు చేసుకున్న వారికి నిన్ను కోరి ఆల్ టైం ఫేవరేట్ మూవీ. ప్రేమ అనేది మరణాన్ని దూరం చేసే  అమృతం కంటే గొప్పదని కూడా చెప్పిన ఈ మూవీలో నానితో పాటు ప్రతి ఒక్కరి నటన ఎంతగానో ఆకట్టుకుంటుంది. 'ఉమామహేశ్వరరావుగా నాని, పల్లవిగా  నివేదా థామస్, అరుణ్ క్యారక్టర్ లో ఆది పినిశెట్టి ప్రాణం పోశారు. 

also read: Allu family: అల్లు ఫ్యామిలీ పుట్టిందే తెలుగు సినిమా కోసమా!. వైరల్ అవుతున్న తాజా న్యూస్ 

మ్యూజిక్ డైరెక్టర్  గోపీ సుందర్ నుంచి వచ్చిన మ్యూజిక్ కూడా నిన్ను కోరి కి అదనపు ఆకర్షణగా నిలిచాయి. అడిగా అడిగా', 'ఉన్నట్టుండి గుండె', 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ వైజాగ్' వంటి పాటలు ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. ఇప్పుడు వెండితెరపై 4K క్వాలిటీతో సాంగ్స్  వినడం గొప్ప అనుభూతిని ఇవ్వనుంది. శివ నిర్వాణ(Siva Nirvana)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అందమైన ప్రేమకావ్యం విడుదలై ఏడు సంవత్సరాలు.  డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ పై ఆర్ఆర్ఆర్ దానయ్య నిర్మించాడు. ఇక మహా నటుడు రావు గోపాలరావు గారు చెప్పినట్టు 'చూడమ్మా శాంభవి ఒక్కొక్కలకి ఒక్కో సీజన్. కాబట్టి ఇది మా సీజన్ అన్నట్టుగా నిన్నే కోరి రాకతో మే మంత్ లవర్స్ సీజన్ అని చెప్పవచ్చు. 

 


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.