Home  »  News  »  Raaka: రాకాలో మేకప్ కి  అల్లుఅర్జున్ ఎంత సమయం తీసుకుంటున్నాడో తెలుసా!

Updated : Apr 23, 2026

 

-శరవేగంగా ముస్తాబవుతున్న రాకా 
-అల్లు అర్జున్ గెటప్ పై ఆగని చర్చలు 
-అసలు ఆ గెటప్ కి ఎంత సమయం పడుతుంది 
-అంత టైంని కూడా బన్నీ లెక్కచేయడం లేదా!

రాకా(Raaka).. రాకా... స్టిల్ పాన్ ఇండియా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే డిస్కర్షన్. రాకా ఎలా ముస్తాబవబోతుంది అని. టీజర్ లో వచ్చిన అల్లు అర్జున్(Allu Arjun)లుక్ తో అయితే ప్రయోగాత్మ చిత్రమనే విషయం క్లియర్ గా అర్ధమవుతుంది. అల్లు అర్జున్ ని ఇప్పటి వరకు చూసింది ఒక ఎత్తు. ఇక నుంచి చూడబోతుంది ఒక ఎత్తు అనడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. దీంతో ఎన్నో ప్రశ్నలు అభిమానులు, మూవీ లవర్స్ లో రన్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రీసెంట్ గా రాకాకి సంబంధించిన ఆసక్తికర న్యూస్ నెట్టింట టూ డే మోస్ట్ ఇంట్రెస్టింగ్  టాపిక్ హోదాలో సర్క్యులేట్ అవుతుంది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.


అల్లు అర్జున్ వైవిధ్యమైన గెటప్ లో కనిపించిన విషయం తెలిసిందే. బహుశా సదరు గెటప్ అతీంద్రియ శక్తులతో కూడిన 'రాకా'ది కావచ్చు. రాకా గెటప్ ని పూర్తిగా రివీల్ చెయ్యకపోయినా గెటప్ యొక్క రేంజ్ ఎలా ఉండబోతుందో అర్ధం అవుతుంది. హెడ్ మీద హెయిర్ లేకుండా  క్లీన్ షేవ్ తో ఉన్నాడు. చేతులకి ఘోస్ట్ లాగా పొడవాటి గోళ్లు ఉన్నాయి. ఫేస్ తో పాటు శరీరం యొక్క ఛాయ కూడా రెగ్యులర్ మనిషిగా లేదు. దీన్ని బట్టి మేకప్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఆ మేకప్ కోసం అల్లు అర్జున్ కి ఐదు గంటల సమయం పడుతుందని, అల్లు అర్జున్ మాత్రం ఎంతో ఓపికతో  అంత సమయాన్ని కూడా లెక్క చెయ్యడం లేదని చెప్తున్నారు. ఒక్కో సారి ఆ సమయం ఏడు గంటలు కూడా పడుతుందని, అయినా సరే తగ్గేదెలే అనే విధంగా అల్లు అర్జున్ షూట్ లో పాల్గొంటున్నాడని చెప్తున్నారు. ఇప్పుడు ఈ న్యూస్ నే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైరల్ గా మారడమే కాదు స్పెషల్ గాను నిలిచింది.

Also read: Nani: మీ కోసం ఈ సమ్మర్ కే వస్తున్నా.. డేట్ ఇదే 


ఎందుకంటే తెలుగు చిత్ర సీమలో రాకా లాంటి ప్రయోగాత్మక చిత్రంలో ఏ హీరో ఈ మధ్య కాలంలో చెయ్యలేదు. పైగా సైన్స్  ఫిక్షన్ . దీంతో అల్లు అర్జున్ తెలుగు సినిమాని, తెలుగు నటుల్ని పాన్ ఇండియా రేంజ్ లో మరింతగా ఎలివేట్ చేయడానికి ఎంతగానో కష్టపడుతున్నారనే కామెంట్స్ ఫ్యాన్స్, నెటిజెన్స్ నుంచి వినపడుతున్నాయి. అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం అనే న్యూస్ కూడా బాగానే చక్కర్లు కొడుతుంది. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.