![]() |
![]() |

'రాజుగారి గది' ప్రాంచైజీలో మూడు సినిమాలు తీసిన డైరెక్టర్, పలు టీవీ షోలు డైరెక్ట్ చేసిన హోస్ట్, ఫేమస్ యాంకర్ ఓంకార్‌కి కరోనా వచ్చిందని సోషల్ మీడియాలో రెండు రోజులుగా వార్త చక్కర్లు కొడుతోంది. అందులో నిజం లేదని ఆయన చెప్పారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఓంకార్ వివరణ ఇచ్చారు.
"జూన్ 26న నేను కరోనా టెస్ట్ చేయించుకున్న మాట వాస్తవమే. శనివారం రిపోర్ట్స్ వచ్చాయి. అందులో రిజల్స్ నెగెటివ్ అని వచ్చింది" అని ఓంకార్ చెప్పారు. తన తల్లికి 55 ఏళ్లు దాటాయనీ, తన ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనీ, అందువల్ల ముందు జాగ్రత్తగా టెస్టులు చేయించుకున్నానని ఆయన తెలిపారు. టెస్ట్ చేయించుకోవడానికి హాస్పటల్‌కి వెళ్లినప్పుడు ఎవరో చూసి కరోనా రూమర్స్ క్రియేట్ చేసి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా నెగెటివ్ రిపోర్ట్స్ తన షోలు చేస్తున్న చానళ్లకు పంపించానని తెలిపారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు ఓంకార్ స్పష్టం చేశారు.
ఇటీవల బుల్లితెర కోసం ఓంకార్ హోస్ట్ గా చేస్తున్న 'ఇస్మార్ట్ జోడీ' షూటింగ్ చేశారు. ఒక షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు కరోనా అని జరిగిన ప్రచారంతో టీవీ ఇండస్ట్రీ ఆందోళన చేసింది. ఆల్రెడీ టీవీ సీరియల్ యాక్టర్స్ ఇద్దరికి కరోనా రావడంతో ఓంకార్ కరోనా న్యూస్ వేగంగా స్ప్రెడ్ అయింది.
![]() |
![]() |